శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 20 మార్చి 2015 (19:19 IST)

బటర్ ఫేస్ ప్యాక్స్ : వారానికోసారి ట్రై చేస్తే..!

బటర్‌ను ఫ్రెష్ క్రీమ్‌తో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం ద్వారా ఇన్ స్టాంట్ గ్లో వస్తుంది. ఇలా వారానికి ఒకసారి ముఖాని అప్లై చేసి మసాజ్ చేస్తే ముఖంలో మంచి గ్లో వస్తుంది.

బటర్‌ను ఒక కప్పు పెరుగులో వేసి బాగా మిక్స్ చేసి ఫేస్ ప్యాక్‌కు వేసుకోవడం వల్ల డ్రై స్కిన్ నివారిస్తుంది. కొద్దిగా కొబ్బరి నూనెతీసుకొని అందులో 2 చెంచాలా బటర్‌ను మిక్స్ చేయాలి. తర్వాత ఫేస్‌కు ప్యాక్‌గా వేసుకొని కాటన్‌తో తుడిచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
 
అలాగే గుప్పెడు బాదంను పొడి, చేసి అందులో 3టేబుల్ స్పూన్ల బటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని ఫేస్ ప్యాక్‌ను పూతలా రాసుకోవాలి. పది నిమిషాలయ్యాక కడిగేస్తే మెరిసే సౌందర్యం లభిస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు. ఈ ఫేస్ ప్యాక్‌‍ల్లో చర్మానికి తగ్గట్లు వారానికొకటి ట్రై చేస్తే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.