శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (09:46 IST)

తెల్లజుట్టుకు చెక్ పెట్టాలంటే.. ఉసిరికాయతో ఇలా చేయండి..

తెల్లజుట్టు సమస్య వేధిస్తుంటే.. ఉసిరికాయను వుపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు బ్యూటీషియన్లు. ఉసిరికాయను ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టాలి. ఎండిన ఉసిరికాయ ముక్కల్ని నూనెకు మిక్స్ చేయాలి. ఇప్పుడు

తెల్లజుట్టు సమస్య వేధిస్తుంటే.. ఉసిరికాయను వుపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు బ్యూటీషియన్లు. ఉసిరికాయను ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టాలి. ఎండిన ఉసిరికాయ ముక్కల్ని నూనెకు మిక్స్ చేయాలి. ఇప్పుడు నూనెను వేడి చేసి గోరువెచ్చగా అయిన తర్వాత తలకు పట్టించాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే జుట్టు నెరవదు. నెరసిన జుట్టు రంగు మారుతుంది. 
 
అలాగే కరివేపాకులో కొద్దిగా మజ్జిగ మిక్స్ చేసి మెత్తగా పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను స్నానం చేసే నీటిలో మిక్స్ చేసి, ఆ నీటితో తలస్నానం చేయాలి. ఈ పద్దతిని వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నువ్వుల నూనెతో కొద్దిగా క్యారెట్ ఆయిల్ మిక్స్ చేసి, ఆ నూనెను జుట్టుకు పట్టించి... 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. 
 
తెల్ల జుట్టును నివారించడంలో మెంతులు బాగా పనిచేస్తాయి. గుప్పెడు మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టి, ఈ నీటిని తలస్నానం చేయడానికి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలోవెరా, గోరింటాకు, ఉసిరి, మందార ఆకులు, పువ్వులను నేరుగానో, నూనె ద్వారానో జుట్టుకు పట్టించడం మంచిది.