శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chitra
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2016 (09:19 IST)

పొడవైన ముఖం ఉన్నవారు.. ఎలాంటి కనుబొమ్మల షేప్ ఉండాలి?

ముఖం మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలంటే కనుబొమల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిందే. అందరికీ ఒకే రకమైన ఐబ్రోస్‌ షేప్‌ ఉండదు. ముఖాకృతికి తగ్గట్టుగా ఉండాలి. ఏ ముఖాకృతికి ఎటువంటి షేప్‌ బాగుంటుందో తెలుసుకుందాం. 
 
ముఖం కొంచెం బొద్దుగా ఉండే వారికి ఐబ్రోస్‌ గుండ్రంగా కాకుండా వంపు తిరిగి ఉంటే చాలా బాగుంటుంది. ఇలా ఉండడం వల్ల బొద్దుగా ఉండే ముఖం సన్నగా కనిపిస్తుంది. ఈ రకమైన ముఖకవళిక ఉన్నవారు ఐబ్రోస్‌ సన్నగా కాకుండా కొంచెం మందంగా ఉండేట్టు జాగ్రత్త తీసుకోవాలి. 
 
అలాగే సన్నగా, పొడవైన ముఖం కలిగిన వారు ఐబ్రోస్‌ని స్ట్రయిట్‌గా ఉంచుకుంటేనే బాగుంటుంది. అలాగని స్కేల్‌ పెట్టి గీత గీసినట్టుగా ఉండకూడదు. వీరి ముఖాకృతికి సన్నటి ఐబ్రోస్‌ నప్పుతాయి. ఐబ్రోస్‌ గుండ్రంగా చేయించుకోవాలనుకుంటే మాత్రం ఆలోచించాల్సిందే. ఎందుకంటే వీరికి ఆ షేప్‌ ఆకర్షణీయంగా ఉండదు.
 
లావు ముక్కు ఉన్న వాళ్లు కనుబొమల మధ్య ఎక్కువ దూరం లేకుండా, మందంగా ఉండేట్టు చూసుకోవాలి. వీరికి హై ఆర్చ్‌డ్‌ ఐబ్రోస్‌ అంటే వంపు ఎక్కువగా ఉండే షేప్‌ బాగుంటుంది. ఈ షేప్‌ వల్ల ముక్కు అంత లావుగా కనిపించదు. అలాగే ఎటువంటి ఫేస్‌కట్‌ వారైనా ఐబ్రోస్‌ని సాధ్యమైనంత పొడవుగా ఉంచుకోవడం వల్ల ఆకర్షణీయంగా కనిపించవచ్చు.