శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By CVR
Last Updated : సోమవారం, 19 జనవరి 2015 (17:35 IST)

పాల మీగడతో ముఖ సౌందర్యానికి మెరుగులు...!

నేటి ఆధునిక యుగంలో ఆరోగ్యంతోపాటు, అందం కూడా అందరికీ అవసరమే. కొందరు బ్యూటీ పార్లర్లకు వెళ్లడం, క్రీములు రాసుకోవడం వలన తమ  అందాన్ని పెంచుకుంటారు. క్రీములు కొనలేనివారు, బ్యూటీ పార్లర్లకు వెళ్లే స్థోమత లేని వారు ఇంటిలోనే పాల మీడగతో ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవచ్చును.
 
పాలు బాగా కాగబెట్టి చల్లారిన తరువాత దాని మీద ఏర్పడే మీగడ పొరను జాగ్రత్తగా చెంచాలో తీసి ఒక చిన్న గిన్నెలో ఉంచుకోండి. ఒక గంట సేపు ఫ్రీజ్ లో ఉంచండి. ఆ తర్వాత మీగడను బాగా కలిపి మెత్తని పేస్టు లాగా చేయండి. ఇప్పుడు అద్దం ముందు కూర్చుని ఆ మీగడ క్రీమ్‍‌ను ముఖానికి మాస్క్ లాగా రాయండి. అది కొంచెం సేపటికి ఆవిరయిపోయి గట్టిపడుతుంది. 
 
అర గంట తర్వాత సబ్బు లేకుండా గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగండి. తర్వాత మెత్తటి టవల్‌తో ముఖం తుడుచుకోండి. ఈ విధంగా వారానికి ఒక రోజు చేస్తే. నెల రోజుల్లో మీ ముఖ సౌందర్యం పెరిగి, మిళమిళ మెరికిపోవడం మీకే స్పష్టంగా కనిపిస్తుంది.