శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 21 మే 2015 (15:46 IST)

బ్లాక్ హెడ్స్‌కు ఓట్స్ మీల్ స్క్రబ్‌తో చెక్ పెట్టండి!

బ్లాక్ హెడ్స్‌కు చెక్ పెట్టాలంటే తప్పకుండా ఓట్ మీల్ స్క్రబ్‌ను ఇంట్లోనే ట్రై చేసి చూడండి. కొద్దిగా పాలపొడి, అందులో కాస్త లావెండర్ ఆయిల్, ఓట్ మీల్ వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి.. మెల్ల మెల్లగా మసాజ్ చేయాలి. ముఖం, ముక్కు మీద బాగా మర్దన చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్, బ్లాక్ హెడ్స్ తొలగిపోయి, ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
అలాగే బాగా పండిన బొప్పాయి ముక్కలకు కొద్దిగా తేనె, పంచదార కలుపుకుని ముఖానికి పట్టించి స్క్రబ్ చేయాలి. పది నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇకపోతే.. టమోటో చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇందులో విటిమిన్ సి ఉండటం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. టమోటో గుజ్జులో కొద్దిగా పంచదార వేసి ముఖానికి పట్టించి శుభ్రం చేయడం వల్ల వృద్ధాప్య లక్షణాలను నివారించుకోవచ్చు.