శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By CVR
Last Updated : సోమవారం, 6 జులై 2015 (16:12 IST)

జుట్టు నిగారింపుకు.. వంటింటి వస్తువులతో హెయిర్ ప్యాక్...

వర్షాకాలం వస్తే చాలు అప్పుడప్పుడూ వర్షంలో తడవాల్సి వస్తుంది. దీంతో జుట్టు సౌందర్యాన్ని కోల్పోయి డల్‌గా తయారవుతుంది. అలాంటప్పుడు మీ జుట్టు ఎప్పటిలా మెరవాలంటే తలకు ఆయిల్ మసాజ్ చేసి, వంటింట్లో వస్తువులతో ప్యాక్ వేసుకుంటే సరి. అది ఎలా చేయాలో మీకోసం.. 
 
వర్షా కాలంలో వారానికి రెండు సార్లు తలంటు స్నానం చేయాలి. ఆ సమయంలో తలకు నువ్వుల నూనె రాసి, సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్‌లో రెండు టీ స్పూన్ల శనగ పిండి తీసుకుని, అందులో ఒక గుడ్డులోని తెల్ల సొనను మాత్రం కలిపి, అదేవిధంగా ఒక టీ స్పూన్ పెరుగు, అర టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. 
 
ఈ మిశ్రమాన్ని కురులకు బాగా పట్టించాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మీ జుట్టు మిల మిల మెరిసిపోవడం ఖాయం.