శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (17:17 IST)

జుట్టు చివర్లు చిట్లకుండా ఉండాలంటే?

జుట్టు చివర్లు కొట్టినా చిట్లినా చాలు, రోజూ తలస్నానం చేసినా ఎండుగడ్డిలా కనిపిస్తుంది. దాన్ని నివారించాలంటే ముందు చివర్లు చిట్లిన భాగాన్ని కత్తిరించేయాలి. ఆ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరి. 
 
అవేంటంటే..? బొప్పాయి గుజ్జును జుట్టుకు పట్టించుకుని అరగంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసి, ఆ తర్వాత షాంపుతో తలస్నానం చేయండి. ఇలా తరచూ చేస్తుంటే ఫలితం ఉంటుంది. 
 
కొద్దిగా కొబ్బరిపాలల్లో గుడ్డుసొన వేసి బాగా కలపాలి. దీన్ని జుట్టంతా పట్టించాలి. కాసేపయ్యాక గాఢత తక్కువగా ఉన్న షాంపూతో రుద్ది కడిగేసుకుంటే మార్పు కనిపిస్తుంది. 
 
రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ నూనెలో ఓ గుడ్డు సొన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసి మర్దన చేసి, అరగంట తర్వాత కడిగేస్తే జుట్టు చివర్లు చిట్లే స మస్య తగ్గుముఖం పడుతుంది.