కొబ్బరి నూనెలో కరివేపాకులు నానబెట్టి ఇలా చేస్తే..?

Last Updated: శనివారం, 8 డిశెంబరు 2018 (13:09 IST)
ఈ కాలంలో చాలామందికి జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. అందుకు ఏం చేసినా కూడా ఎలాంటి లాభాలు కనిపించలేదని బాధపడుతున్నారు. బయట దొరికే పదార్థాలకంటే ఇంట్లోని చిట్కాలు పాటిస్తే కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం..
 
1. జుట్టు రాలకుండా ఉండాలంటే.. తడిగా ఉన్నప్పుడు దువ్వితే వెంట్రుకలు తెగిపోయే అవకాశం ఉంది. కాబట్టి తడి పూర్తిగా ఆరిన తర్వాతే దువ్వుకోవాలి. 
 
2. టవల్‌తో వెంట్రుకలను సున్నితంగా తుడిచి ఆరబెట్టాలి. గట్టిగా రుద్దితే వెంట్రుకలు తెగిపోతాయి. దువ్వెలను ఎప్పటికప్పుడూ శుభ్రం చేస్తూ ఉండాలి. లేదంటే దాన్లో ఇరుక్కున్న మట్టి వల్ల వెంట్రుకలు ఊడే సమస్య తలెత్తవచ్చు. 
 
3. తరచు తలకు నూనె రాస్తుండాలి. వారానికోసారి హాట్ ఆయిల్ ట్రీట్‌మెంట్ చేయాలి. ఇందుకోసం కొబ్బరినూనెను వేడిచేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే కుదుళ్లకు పట్టించి మసాజ్ చేయాలి. ఇలా చేస్తే వెంట్రుకల కుదుళ్లను ఆరోగ్యంగా ఉంటాయి.
 
4. కప్పు కొబ్బరినూనెను వేడి చేసుకుని అందులో రెండు రెమ్మల కరివేపాకు వేసి కాసేపు అలానే ఉంచాలి. ఈ నూనెను తరచు తలకు పట్టిస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. 
 
5. మెంతులు పేస్ట్ చేసి అందులో పావుకప్పు పెరుగు కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి జుట్టుకు రాసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు మృదువుగా మారుతుంది. దీనిపై మరింత చదవండి :