శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శనివారం, 20 అక్టోబరు 2018 (13:17 IST)

వేడినూనెతో రాత్రి అలా హాయిగా హెడ్ మసాజ్ చేసుకుంటే..?

వేడినూనె.. గోరువెచ్చగా మాడు తట్టుకునేంత స్థాయిలో వేడితో రాత్రి పూట అలా హాయిగా హెడ్ మసాజ్ చేసుకుంటే.. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇలా వేడినూనెతో రాత్రి హెడ్ మసాజ్ చేసుకుని మరుసటి రోజు ఉదయం తలస్నానం చేసినట్లైతే జుట్టు మృదువుగా తయారవుతాయి. కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్ తీసుకుని ఒక గిన్నెలో కలుపుకుని.. కాస్త వేడి చేసుకోవాలి. 
 
ఈ ఆయిల్‌కు మూడు చుక్కలు సుగంధ తైలాలైన రోజ్ మేరీ, లావెండర్ నూనె కానీ రెండు చుక్కలు జోడించాలి. చెక్క గరిటెతో ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. తర్వాత ఈ నూనెని మెల్లగా తల మాడుకు పట్టించాలి. 
 
నూనె వేడి కాస్త తగ్గాక.. తలపై ఉండే చర్మంపై నూనెతో మర్దన చేసి, జుట్టు చివరి వరకు నూనెతో రాసుకోవాలి. ఇలా రాసుకున్న 20 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేసినట్లైతే మంచి ఫలితం ఉంటుంది. అంతేగాకుండా జుట్టు మృదువుగా, దృఢంగా ఉంటాయని బ్యూటీషియన్లు చెప్తున్నారు.