శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 22 సెప్టెంబరు 2014 (17:23 IST)

మందారపువ్వుతో నిగనిగలాడే హెయిర్ కేర్ టిప్స్!

మందారపువ్వు కేశ సంరక్షణకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. మందారలో పట్టుకుచ్చులాంటి నిగనిగలాడే జట్టును పొందవచ్చు. మందారపు పువ్వుని కాగేనూనేలో వేసి చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించుకుని అరగంట తరవాత స్నానం చేస్తే జుట్టు నిగనిగ లాడుతూ వత్తుగా పెరుగుతుంది.
 
అలాగే ఆరు మందారపువ్వుల్ని గుజ్జుగా చేసి అందులో ఒక స్పూను కలబంద గుజ్జు కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే పొడిబారినట్టు జీవం లేకుండా తయారైన జుట్టును దూరం చేసుకోవచ్చు. 
 
ఒక గ్లాసు నీళ్లలో రెండు టీ స్పూన్ల టీ పొడి వేసి మరిగించి అందులో ఒక టేబుల్ స్పూను మందారపొడి వేసి కలిపి తలకు పట్టించాలి. జుట్టుకి ఇది మంచి కండీషనర్‌గా ఉపయోగపడుతుంది.
 
వెంట్రుకలు చిట్లిపోకుండా ఉండాలంటే ఒక కప్పు పుల్లటి పెరుగులో రెండు టీ స్పూన్ల మందారపొడి వేసి బాగా కలిపి జుట్టుకి పట్టించాలి. జుట్టు ఎదుగుదలకు పోషకపదార్ధాలు, ప్రోటిన్స్ అవసరం కాబట్టి బలమైన పోషక పదార్ధాలైన పాలు, పళ్ళ రసాలు రోజు తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.