శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 12 అక్టోబరు 2016 (14:04 IST)

నల్లటి మచ్చలకు ఇలా చెక్ పెట్టండి.. కీరదోస పేస్టులో పాలు, నిమ్మరసం కలిపి?

కీరదోస గుజ్జులో కాసిని పాలు, నిమ్మరసం కలిపి ముద్దలా చేసుకుని.. మచ్చలున్న చోట రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి ఇలా చేస్తే మచ్చలు తగ్గిపోతాయి. అలాగే టమోటా గుజ్జులో ఓ టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి

కీరదోస గుజ్జులో కాసిని పాలు, నిమ్మరసం కలిపి ముద్దలా చేసుకుని.. మచ్చలున్న చోట రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి ఇలా చేస్తే మచ్చలు తగ్గిపోతాయి. అలాగే టమోటా గుజ్జులో ఓ టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి మర్దన చేయాలి పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తే ముఖంపై మచ్చలు తగ్గిపోతాయి. 
 
ఇంకా ముఖంపై నల్లటి మచ్చలు తొలగిపోవాలంటే.. 
* కలబంద గుజ్జును తీసుకుని ఓ ఐదునిమిషాలు ఎండలో ఉంచాలి. అందులో కొన్నిచుక్కల నిమ్మరసం కలిపి ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. పదిహేను నిమిషాల తరవాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
* రెండు చెంచాల గంధంపొడిలో కొన్నిచుక్కల గులాబీనీరు కలిపి మచ్చలున్న చోట రాయండి. పూర్తిగా ఆరిపోయాక కడిగేయాలి. మచ్చల ప్రభావం తగ్గడమే కాదు.. ముఖం కూడా మృదువుగా మారుతుంది.
 
* బంగాళాదుంప పేస్టుకు కాసింత తేనె కలిసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మచ్చలు తొలగిపోతాయి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం మృదువుగా కోమలంగా తయారవుతుంది.
 
* నిమ్మలో విటమిన్‌ ‘సి’తోపాటూ యాస్ట్రింజెంట్‌ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మాన్ని శుభ్రపరచడమే కాదు.. మచ్చల్నీ నివారిస్తాయి. కాబట్టి నిమ్మకాయ ముక్కను తీసుకుని ముఖంపై రుద్దుకోవాలి. నిమ్మరసంలో దూదిని ముంచి.. ముఖంపై రాసుకున్నా సరిపోతుంది.