శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 13 జులై 2016 (14:47 IST)

బొప్పాయి రసంతో పాలు కలిపి పేస్టును ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే?

సహజసిద్ధంగా ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలంటే.. ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఒక స్పూన్‌ తేనె, ఒక స్పూన్ క్యారెట్ జ్యూస్ కలుపుకుని.. మెడచుట్టూ ప్యాక్‌లా వేసుకోవాలి. 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచి...

సహజసిద్ధంగా ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలంటే.. ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఒక స్పూన్‌ తేనె, ఒక స్పూన్ క్యారెట్ జ్యూస్ కలుపుకుని.. మెడచుట్టూ ప్యాక్‌లా వేసుకోవాలి. 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచి... ఆపై గోరువెచ్చని వేడి నీటిలో కడిగేసుకుంటే ముఖ చర్మం కాంతివంతంగా తయారవుతుంది. వారానికి ఇలా రెండు లేదా మూడు సార్లు చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. 
 
ఇంకా బత్తాయి రసంలో ఒక స్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే.. ముడతలు తగ్గిపోతాయి. అలాగే బొప్పాయి రసంతో పాలు కలిపి పేస్టులా తయారు చేసి ముఖానికి ప్యాక్ వేసుకుంటే.. ముడతలకు చెక్ పెట్టవచ్చు.
 
ఇక ఒక స్పూన్ తులసీ రసంతో పాటు అర స్పూన్ తేనెను కలిపి రోజూ ఉదయం పరగడుపున తీసుకుంటే చర్మం కోమలంగా తయారవుతుంది. ఇక కీరదోస మంచి బ్లీచ్‌కు పనికొస్తుంది. శరీరానికి చలవచేయడంతో పాటు ముఖ సౌందర్యాన్ని పెంపొందింపజేయడంలో కీరదోస బెస్ట్‌గా పనిచేస్తుంది. రోజూ కీరదోస జ్యూస్‌ను ముఖానికి రాసుకుని అరగంట పాటు ఉంచి వేడినీటిలో కడిగేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.