వేసవిలో కూల్ ప్యాక్స్.. నిమ్మరసానికి కలబంద గుజ్జు తోడైతే?

మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (17:45 IST)

వేసవిలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎండ ప్రభావాన్ని భరించక తప్పదు. ముఖ్యంగా చర్మం ఎండకు కమిలిపోయి నల్లబారుతుంది. ఈ సమస్యలకు గురికాకుండా తప్పించుకోవటం అసాధ్యం. కాబట్టి పాడైన చర్మానికి ఫేస్ ప్యాక్స్‌తో సంరక్షించుకోవాలి. ఇందుకోసం ఈ సమ్మర్ ప్యాక్స్‌ను ఇంట్లోనే ట్రై చేయండి.
 
నిమ్మతో చర్మానికి వేసవిలో మేలు చేయొచ్చు. నిమ్మకు తోడైతే మెరిసే సౌందర్యం మీ సొంతం అవుతుంది. నిమ్మ.. కలబంద ప్యాక్ ఎలా తయారు చేయాలంటే.. నిమ్మ బ్లీచింగ్ ఏజెంట్. చర్మానికి హాని కలగకుండా మెరుపు తీసుకురావటంలో నిమ్మకు మించిన ఔషదం లేదు. కలబందకు చర్మం మీది బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మక్రిములను నశింపచేసే గుణం వుంటుంది.
 
నిమ్మరసం పావు కప్పు, కలబంద గుజ్జు ఓ స్పూన్ చేర్చి.. బాగా కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే వేసవిలో ఏర్పడే చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే కలబంద గుజ్జులో నిమ్మరసం కలిపి ముఖానికి, చేతులకు రాసుకొని పూర్తిగా ఆరాక కడిగేసుకోవాలి. ఇలా రోజుకి రెండు,మూడు సార్లు చేసినటైతే చర్మం శుభ్రంగా వుండటంతో పాటు మృదువుగా తయారవుతుంది.
 
ఇకపోతే.. పసుపు, పెరుగు, తేనె కూడా చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయి. పసుపు క్రిమిసంహారిణి, తేనె, పెరుగు సహజమైన మాయిశ్చర్తెజర్లుగా పనిచేస్తాయి. ఎండతో పొడిబారిన చర్మాన్ని తేమగా మార్చుకోవాలంటే.. ఈ మూడింటిని కలిపి ప్యాక్ వేసుకొని పది నిమిషాలు తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా చేసినట్లైతే చర్మం కొత్త మెరుపును సంతరించుకుంటుందని బ్యూటీషియన్లు సలహా ఇస్తున్నారు. దీనిపై మరింత చదవండి :  
వేసవి కాలం ఫేస్ ప్యాక్స్ నిమ్మరసం తేనె పసుపు కలబంద పెరుగు Turmeric Honey Curd Summer Lemon Face Packs Aloe Vera

Loading comments ...

మహిళ

news

ఆముదం నూనెలో దూదిని ముంచి కనుబొమలకు రాస్తే...

కనుబొమలు బాగా కనబడడానికి మార్కెట్లో ఎన్నో రకాల మందులు ఉన్నాయి. తీర్చిదిద్దినట్టు చక్కగా ...

news

కలబందతో అందం... ఎలాగో తెలుసా?

కలబంద వలన మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మన చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో ...

news

వేసవి ఎండలు ముదురుతున్నాయి... చర్మ సౌందర్యానికి చిట్కాలు...

ఎండలు బాగా పెరుగుతున్నాయి. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాతావరణంలో ...

news

ప్రతిరోజూ పెదవులకు తేనె రాసుకుంటే ఫలితం ఏమిటో తెలుసా?

మనం తీసుకునే ఆహారం, అధిక వేడీ, సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల పెదాలు సహజమైన రంగును ...