వేసవిలో సబ్జా గింజలను కొబ్బరి నీటిలో నానబెట్టి తాగితే?

సోమవారం, 16 ఏప్రియల్ 2018 (11:10 IST)

వేసవిలో సబ్జా గింజలను కొబ్బరి నీటిలో నానబెట్టి తాగితే...శరీర తాపం తగ్గిపోతుంది. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది. వేసవిలో చెమటకాయలను సబ్జా సీడ్స్ రానీయకుండా చేస్తాయి. సబ్జాగింజల్ని నీళ్లలో గాని, కొబ్బరి నీళ్లలోగాని నానబెట్టి తాగితే శరీర తాపం తగ్గుముఖం పడుతుంది.


మాంసాహారం తీసుకున్నప్పుడు అర్థగంట తర్వాత సబ్జా సీడ్స్ నీటిని తాగడం ద్వారా అజీర్ణ సమస్యలు దూరమవుతాయి. తద్వారా హానికరమైన టాక్సిన్లు పొట్టలోకి చేరకుండా చేస్తాయి.
 
గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి జ్వరం ఉన్నప్పుడు సబ్జా గింజల్ని నీళ్లలో నానబెట్టి తిన్నా, తాగినా ఫలితం ఉంటుంది. అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే సత్వర ఫలితం వుంటుంది. గ్లాసునీళ్లలో సబ్జాగింజల గుజ్జు వేసి రోజుకు మూడు నాలుగు సార్లు తాగితే బరువు తగ్గుతారు. 
 
సబ్జా గింజల గుజ్జును పైనాపిల్‌, ఆపిల్‌, ద్రాక్షరసాల్లో కలిపి పిల్లలకు తాగిస్తే నుంచి కాపాడుకోవచ్చు. సబ్జాగింజలతో నానబెట్టిన నీటిని నిద్రపోయేముందు తాగితే బరువు తగ్గుతారు. సబ్జా గింజలు యాంటి బయాటిక్‌గా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

లిఫ్ట్ ఉపయోగిస్తున్నారా? మెట్లెక్కుతున్నారా?

లిఫ్ట్ ఉపయోగిస్తున్నారా? మెట్లెక్కుతున్నారా?.. లిఫ్ట్ అధికంగా ఉపయోగిస్తే అనారోగ్య ...

news

రెండు యాలకులు, ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు ఎంత ఆరోగ్యమో...

యాలకులను ఇంట్లో మసాలా దినుసులు గాను, మౌత్ ప్రెష్ నర్ గా వాడుతుంటారు. టీ తయారీలో యాలకులను ...

news

దంత సమస్యలకు ఆయుర్వేద వైద్యం...

చాలామంది అనారోగ్య సమస్యలలో పంటి నొప్పి కూడా ఒకటి. దీనికి కారణం చిగుళ్లు బలహీనంగా ఉండటం. ఈ ...

news

మొక్కజొన్న నూనెతో మేలెంతో తెలుసా? పొట్ట కూడా ఇలా తగ్గిపోతుంది..

మొక్కజొన్నలో ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేసే గుణాలున్నాయి. ఇందులో ఫైబర్, లో-ఫ్యాట్ ...