శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chitra
Last Updated : గురువారం, 12 మే 2016 (14:46 IST)

మగువల అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసే కాటుక!

కళ్లకి కాటుక పెట్టుకోవడం వల్ల మగువల అందం మరింత రెట్టింపవుతుంది. అలాంటి కాటుక పెట్టుకునేటప్పుడు కొన్ని మెళకువలు పాటించాలి.అవేంటో చూద్దాం!
 
జిడ్డు చర్మం ఉన్నవారు ఐస్‌ ముక్కలతో ముఖాన్ని మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చెమట పట్టడం తగ్గుతుంది. తద్వారా కాటుక చెరిగిపోకుండా ఉంటుంది. 
 
ఫేస్‌ పౌడర్‌ వాడటం ద్వారా కూడా కాటుక చెరిగిపోకుండా ఉంటుంది. కళ్ల చుట్టూ కొద్దిగా ఫేస్‌ పౌడర్‌ రాసుకోవాలి. అక్కడి చర్మంపై ఉండే జిడ్డుని పౌడర్‌ పీల్చుకోవడం వల్ల కళ్లు కాంతిలీనుతుంది.
 
కాటుక పెట్టుకోడానికి ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ముఖంపై, కళ్లపై ఏమాత్రం తడిలేకుండా తుడుచుకోవాలి. తర్వాతే కాటుక పెట్టుకోవాలి. 
 
చాలా మంది కనురెప్పల చివర భాగంలో కాటుక పెట్టుకుంటారు. అలా చేయడం వల్ల చెరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని కనురెప్పల మధ్యభాగంలో మాత్రమే కాటుక పెట్టుకోవాలి.
 
నేత్రాలకు కాటుక పెట్టుకునే ముందు కళ్లకి లైట్‌ కలర్‌ ఐషాడోని బేస్‌గా వేసుకోవాలి. ఆ తర్వాత కళ్లకి కాటుక పెట్టుకోవాలి. మందంగా, చక్కగాపడే సన్నని కాటుక పెన్సిల్‌ని ఎంచుకోవడం ద్వారా కూడా కాటుక చెరిగిపోకుండా చూసుకోవచ్చు.