శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 9 మే 2015 (17:56 IST)

ఖర్బూజ గుజ్జుతో జిడ్డు చర్మానికి చెక్.. ఫేస్ ప్యాక్‌లా..!

ఖర్భూజ ముక్కలుగా కట్ చేస్తుంటే జ్యూస్ వస్తుంది. ఆ జ్యూస్‌ను టోనర్‌గా ఉపయోగించుకోవచ్చు. జిడ్డు చర్మానికి ఖర్బూజ సూపర్‌గా పనిచేస్తుంది. ఖర్బూజ పండు ముక్కల్ని బ్లెండర్‌లో వేసి మెత్తటి గుజ్జులా పట్టాలి.

ఇందులో అర స్పూన్‌ నిమ్మరసం, శెనగపిండి వేసి ఫేస్‌ప్యాక్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద, మెడ మీద రాసుకుని పావుగంట తరువాత గోరు వెచ్చటి నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడిగేయాలి.
 
అలాగే పొడి చర్మానికి: మిక్సీ పట్టిన ఖర్బూజ పండు గుజ్జులో కొద్దిగా పాల మీగడ, ముల్తానీ మట్టి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్‌ ప్యాక్‌లా వేసుకుంటే చర్మానికి అవసరమైన తేమ అందుతుంది. ఎండాకాలంలో చర్మం నిర్జీవం అయిపోకుండా మెరుస్తుంటుంది.