శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chj
Last Modified: గురువారం, 30 మార్చి 2017 (21:38 IST)

ముఖంపై మచ్చలు... నిమ్మరసంతో ఇలా తొలగించవచ్చు....

నిమ్మకాయ రసం ముఖంతో పాటు.. శరీరంపై ఉన్న మచ్చలు పోగొట్టడంలో ఔషధంగా పనిచేస్తుంది. ఒక నిమ్మకాయ నుంచి రసాన్ని పిండుకుని దూదితో మొటిమలు మచ్చలపై రాస్తే ముఖంలోని పింపుల్ మార్క్స్ మాయమవుతాయి. ప్రతిరోజూ ఐదు నిమిషాల పాటు నిమ్మరసాన్ని అప్లై చేస్తే మంచి ఫలితం ఉం

నిమ్మకాయ రసం ముఖంతో పాటు.. శరీరంపై ఉన్న మచ్చలు పోగొట్టడంలో ఔషధంగా పనిచేస్తుంది. ఒక నిమ్మకాయ నుంచి రసాన్ని పిండుకుని దూదితో మొటిమలు మచ్చలపై రాస్తే ముఖంలోని పింపుల్ మార్క్స్ మాయమవుతాయి. ప్రతిరోజూ ఐదు నిమిషాల పాటు నిమ్మరసాన్ని అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుందని బ్యూటీషన్లు అంటున్నారు. 
 
అలాగే శరీర చర్మంపై ఏర్పడే చికెన్ ఫాక్స్ మచ్చలు పోవాలంటే కూడా నిమ్మరసంతో ముఖానికి ప్యాక్ లా వేసుకుంటే మంచిదని వారు చెబుతున్నారు. ఇంకా చికెన్ ఫాక్స్ మచ్చలు మాయమవ్వాలంటే పసుపు, కరివేపాకును మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీరంలోని చికెన్ ఫాక్స్ మచ్చలపై రాసి 15 నిమిషాల తర్వాత కడిగిస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 
ఇక పింపుల్స్ పూర్తిగా తొలగిపోవాలంటే నిమ్మరసాన్ని దూదితో అప్లై చేసి అరగంట తర్వాత కడిగేయండి మీ చర్మం మిలమిల మెరిసిపోతుంది. ఇంకా కొద్ది రోజులు ఇలా చేస్తే పింపుల్స్ ఉండవని బ్యూటీషన్లు అంటున్నారు. 
 
అలాగే బొప్పాయి చెట్టు నుంచి వచ్చే పాలను కాసింత తీసుకుని అందులో నీటిని చేర్చండి. ఈ బొప్పాయి పాలు, నీటి మిశ్రమంలో నానబెట్టిన జీలకర్రను కలపండి 15 నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే ముఖంలోని మచ్చలు మటుమాయం అవుతాయి.