శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 19 నవంబరు 2014 (15:03 IST)

మచ్చలకు చెక్ పెట్టే నిమ్మ, టమోటా మాస్క్!

మొహంపై మచ్చలు తొలగిపోవాలంటే లెమన్, టమోటా మాస్క్‌లను ట్రై చేయండి అంటున్నారు బ్యూటీషన్లు. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి మచ్చలను పోగొట్టి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. 
 
నిమ్మరసం, బాదం, నూనె, పాలు, తేనెలను కలిపి మిశ్రమాన్ని పది రోజులు ఈ మచ్చల మీద రాస్తే అవి తొలిగిపోతాయి. అయితే ఈ మిశ్రమాన్ని రాసిన తర్వాత ఎండలో వెళ్లకూడదు. 
 
అలాగే మార్కెట్లో అవకాడో నూనె దొరుకుతుంది. దీనిలో రెండు టమోటాల గుజ్జు, ఒక పొడవు దోసకాయ గుజ్జును కలపాలి. ఈ మిశ్రమాన్ని మొహానికి పట్టించి ఇరవై నిమిషాలు వదిలేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో మొహాన్ని కడుక్కొవాలి. ఇలా పదిహేను రోజులు చేస్తే మచ్చలు పోతాయి.