శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 15 ఆగస్టు 2016 (12:59 IST)

పెదవులు మృదువుగా మారాలంటే.. కొత్తిమీర, క్యారెట్‌ జ్యూస్ కలిపి..?

పెదవులు అందవిహీనంగా తయారవుతున్నాయా.. అయితే ఈ టిప్స్ పాటించండి. రోజూ రాత్రి పడుకునే ముందు పెదాలకు తేనె రాసి మెత్తని బ్రష్‌తో మృదువుగా రుద్దాలి. ఇలాచేయడం వల్ల ఉదయానికి పొడిబారే సమస్య తగ్గుతుంది. పెదాలు

పెదవులు అందవిహీనంగా తయారవుతున్నాయా.. అయితే ఈ టిప్స్ పాటించండి. రోజూ రాత్రి పడుకునే ముందు పెదాలకు తేనె రాసి మెత్తని బ్రష్‌తో మృదువుగా రుద్దాలి. ఇలాచేయడం వల్ల ఉదయానికి పొడిబారే సమస్య తగ్గుతుంది. పెదాలు తగిన తేమతో కాంతిమంతంగా కనిపిస్తాయి. కొత్తిమీర, క్యారెట్‌లను రసంగా తీసుకుని సమాన పరిమాణంలో కలుపుకోవాలి. రోజూ రాత్రిపూట ఈ మిశ్రమాన్ని రాసుకుంటే పెదాలు మృదువుగా మారతాయి.
 
గుప్పెడు గులాబీరేకుల్ని ముద్దగా చేసుకుని దానికి చెంచా వెన్న కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండు చుక్కల బాదం నూనె చేర్చి పెదాలకు రాసుకుంటే మృదువుగా కనిపిస్తాయి. పెదవులు గులాబీరేకుల్లా ఉండాలంటే.. తేనె, పంచదార ఆలివ్‌నూనెల మిశ్రమాన్ని పెదాలకు రాసి మృదువుగా రుద్దితే మృతకణాలు తొలగిపోతాయి. నలుపుదనం తగ్గుతుంది. అందంగానూ కనిపిస్తాయి. బీట్‌రూట్ రసాన్ని ఉదయాన్నే పెదాలకు రాసుకుంటే పెదాలు మృదువుగా తయారవుతాయి.