శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (16:32 IST)

బంగాళాదుంప-కందిపప్పుతో హెయిర్ రిమూవ్ టిప్స్!

బక బంగాళాదుంప రసం ఒక కప్పు, కందిపప్పు ఒక కప్పు, తేనె ఒక టీ స్పూన్, నిమ్మరసం 4 టీ స్పూన్లు. ఒక రాత్రంతా కందిపప్పును నానబెట్టి ఉదయాన్నే మెత్తగా రుబ్బుకోవాలి. దీన్లో బంగాళాదుంప రసం, తేనె, నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖం, కాళ్లు, చేతులకు అప్లై చేయాలి. పూర్తిగా ఆరే వరకు 20 నిమిషాల పాటు ఆగాలి. 
 
పూర్తిగా ఆరాక చేతి వేళ్లతో రుద్దుతూ పేస్ట్‌ను వదిలించాలి. ఈ పొడి రాలేటప్పుడు దాంతోపాటు అవాంఛిత రోమాలు కూడా రాలిపోతాయి. తద్వారా చర్మం సున్నితంగా, కోమలంగా సౌందర్యవంతంగా మారుతుంది. 

అలాగే చక్కెర-నిమ్మరసంతో అవాంఛిత రోమాలను దూరం చేసుకోవచ్చు. రెండు స్పూన్ల చక్కెర, రెండు స్పూన్ల తాజా నిమ్మరసం, నీళ్లు తీసుకుని చక్కెర కరిగే వరకు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 15-20 నిమిషాల చేతితో మసాజ్ చేస్తూ కడిగేయాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే ముఖం మీది రోమాలు తగ్గుముఖం పడతాయి.