శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2015 (17:46 IST)

వేసవిలో పాదాల పగుళ్లకు కొబ్బరినూనెతో చెక్!

వేసవిలో పాదాల పగుళ్లకు కొబ్బరినూనెతో చెక్ పెట్టవచ్చు. పాదాల పగుళ్ళను నివారించుకోవడానికి కొబ్బరి నూనె గ్రేట్‌గా సహాయపడుతుంది. ఈ నూనెను ప్రతి రోజూ రెగ్యులర్‌గా ఉపయోగిస్తుంటే పాదాల పగుళ్ళు నివారించి చర్మం మృదువుగా తయారవుతుంది. అలాగే వేసవిలో చర్మం ప్రకాశవంతంగా ఉండాలంటే కొబ్బరి నూనె శరీరానికి అప్లై చేస్తే సరిపోతుంది. కొన్ని చుక్కల నూనెను స్నానం చేసే నీటిలో వేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
వేసవిలో సన్ టాన్ నివారించడానికి కూడా కొబ్బరి నూనెను అప్లై చేస్తే చర్మం ఒరిజినల్ కలర్‌ను సంతరించుకుంటుంది. టాన్ నివారించుకోవడానికి కొబ్బరి నూనెలో కొద్దిగా టమోటో రసం మిక్స్ చేసి టాన్ ఏరియాలో అప్లై చేసుకుంటే.. చర్మం మృదువుగా తయారవుతుంది. వేసవి కాలంలో పెదాల పగుళ్ళు, డ్రై లిప్‌ను నివారించడానికి కొబ్బరినూనె గ్రేట్‌గా సహాయపడుతుంది. లిప్ బామ్‌కు బదులుగా కొబ్బరి నూనెను అప్లై చేసి ఫలితాన్ని మీరే గమనించవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు.