శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2016 (12:38 IST)

పాల పౌడర్‌తో చర్మం మెరిసిపోతుంది.. ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసా?

చర్మం శుభ్రపడి కాంతివంతంగా కనిపించాలంటే.. అరచెక్క నిమ్మరసం పిండి, దానికి కాస్త పాలపొడి, చెంచా చొప్పున తేనె, పంచదార కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని మృదువుగా రుద్దుకుంటే చర్మంపై ఉండి మురికి

పార్టీకి వెళ్ళాలా? చిటికెలో చర్మాన్ని నిగారింపుగా మార్చే సౌందర్య చిట్కాలు ఇవిగోండి. 
 
* చర్మం శుభ్రపడి కాంతివంతంగా కనిపించాలంటే.. అరచెక్క నిమ్మరసం పిండి, దానికి కాస్త పాలపొడి, చెంచా చొప్పున తేనె, పంచదార కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని మృదువుగా రుద్దుకుంటే చర్మంపై ఉండి మురికి, మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా తయారవుతుంది. 
 
* కంటి కిందటి నల్లటి చారలు ఏర్పడి, చర్మం సాగినట్లు అనిపిస్తే కోడిగుడ్డలోని తెల్లసొన రాసి పదినిమిషాల తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే సరి. చర్మం బిగుతుగా మారి కళ్లు కాంతిమంతంగా కనిపిస్తాయి. నల్లటి వలయాలు ఉన్నప్పుడు బంగాళాదుంపను గుజ్జుగా చేసి దానికి కాసిని పాలు కలిపి కంటి కింద పూతలా వేయాలి. ఇలా కనీసం రోజు విడిచి రోజు చేస్తుంటే అవీ క్రమంగా తగ్గుముఖం పడతాయి.
 
* అలాగే విటమిన్ ఇ పుష్కలంగా గల బాదం నూనెలో, రెండు చుక్కల తేనె కలిపి ముఖానికి పట్టించాలి. పావుగంట పాటు ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.