శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 8 మే 2015 (18:14 IST)

వేసవిలో చర్మ సౌందర్యం కోసం ఈ టిప్స్ పాటించండి.

వేసవిలో సన్ టాన్ నుంచి చర్మాన్ని కాపాడాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ఇంట్లోనే పాటిస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం.. ఫేస్ వాష్ : ఎండాకాలంలో ముఖం జిడ్డుగా మారుతుంది. దీనివల్ల ముఖం మీద దుమ్ము ధూళి పడి పాడైపోయే అవకాశం ఉంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకుంటూ ఉండాలి. సోపు, ఫేస్ వాష్, క్రీమ్స్, లోషన్స్ వాడవచ్చు. 
 
సన్‌స్క్రీన్‌ లోషన్‌ : ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు ప్రతి అరగంటకొకసారి సన్ టాన్ నుంచి రక్షించే లోషన్లను ముఖానికి రాసుకోవాలి. లేకపోతే వేసవి వేడి వల్ల చర్మం దెబ్బతింటుంది. ఒక్కోసారి చర్మక్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు.
 
సన్‌ బ్లాక్‌ క్రీమ్‌ : ఒక్కోసారి మిట్టమధ్యాహ్నం బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎస్‌పిఎఫ్‌ 60 సన్‌బ్లాక్‌ క్రీముల్ని వెంటబెట్టుకు వెళ్లాలి. ముఖ్యంగా సమ్మర్‌లో ఎక్కువగా స్విమ్మింగ్‌ చేసేవాళ్లకు ఇది తప్పనిసరి.
 
మైల్డ్‌ షాంపూ : వేసవిలో స్ట్రాంగ్ షాంపూలను వాడొద్దు. అందులోని రసాయనాలకు వేసవి వేడి కూడా తోడవ్వడం వల్ల జుట్టుకు హాని కలుగుతుంది. అందుకని ఈ సీజన్‌లో మైల్డ్‌ షాంపూలను ఉపయోగిస్తేనే మంచిది.