శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : మంగళవారం, 12 మే 2015 (17:41 IST)

సమ్మర్ స్పెషల్ : ఫ్రూట్ ఫేస్ ప్యాక్ ఇవిగోండి!

వేసవిలో మీ చర్మ సౌందర్యాన్ని ఏయే పండ్లు మెరుగుపరుస్తాయో తెలుసుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో చేయండి. విటమిన్స్ పుష్కలంగా ఉండే పండ్లను ఫేస్ ప్యాక్స్‌గా ఉపయోగించడం ద్వారా చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. 
 
* విటమిన్-ఎ గల బొప్పాయి పండు గుజ్జును ముఖానికి ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటే.. చర్మ ఛాయ పెంపొందడంతో పాటు చర్మం మృదువుగా తయారవుతుంది. 
 
* ఆపిల్ పండు కూడా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆపిల్ గుజ్జును ముఖానికి ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటే ముఖంపై గల మచ్చలు తొలగిపోతాయి.
 
* బత్తాయి రసంలో విటమిన్ -సి పుష్కలంగా ఉంది. బత్తాయి రసాన్ని ముఖానికి రాసుకుంటే జిడ్డు చర్మాన్ని తొలగించుకోవచ్చు. సన్ టాన్ నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది.  
 
* నారింజ పండులో విటమన్ సి ఉండటంతో నారింజ రసాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్‌లా వేసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కళకళలాడుతుంది. 
 
* జామకాయలోనూ విటమిన్ ఉండటం ద్వారా.. ఈ గుజ్జు ముఖానికి ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటే చర్మం మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. 
 
* ఇక చౌకగా లభించే బనానా ముఖచర్మానికి ఎంతో మేలు చేస్తుంది. వయస్సుతో సంబంధం లేకుండా బనానా ఫేస్ ప్యాక్‌ను ఉపయోగించడం ద్వారా యాంటీ-ఏజింగ్ లక్షణాలను దూరం చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ క్లీనింగ్‌కు గోరువెచ్చని నీటిని ఉపయోగించుకోవచ్చు.