గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chj
Last Modified: బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (22:01 IST)

అందంగా ఉండాలనుకుంటున్నారా... ఏం తినాలో తెలుసుకోండి...

ముఖంలో కాస్త వయసు కనపడితే చాలు చాలామంది ఆందోళనకు లోనవుతుంటారు. కొందరైతే తీవ్ర ఒత్తిడికి గురవుతారు కూడా. అలాకాకుండా నవయౌవనులుగా కనిపించాలంటే కొన్ని యాంటి-ఏజింగ్ డైట్స్ ఉన్నాయి. 1. బ్లూ బెర్రీలు తింటే నాజుగ్గా కనిపిస్తారు. వయసు తెలియదు. వీటిల్లోని యా

ముఖంలో కాస్త వయసు కనపడితే  చాలు చాలామంది ఆందోళనకు లోనవుతుంటారు. కొందరైతే తీవ్ర ఒత్తిడికి గురవుతారు కూడా. అలాకాకుండా నవయౌవనులుగా కనిపించాలంటే కొన్ని యాంటి-ఏజింగ్ డైట్స్ ఉన్నాయి.
 
1. బ్లూ బెర్రీలు తింటే నాజుగ్గా కనిపిస్తారు. వయసు తెలియదు. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు వల్ల వయసుతో వచ్చే శరీరక, మానసిక మార్పులను సులభంగా అధిగమించగలరు.
 
2. చిలకడదుంప, కేరట్, గుమ్మడి కాయల్లో బెటాకెరొటెన్ అధికం. ఇవి ఏజింగ్‌ను అరికట్టడంలో శక్తివంతంగా పనిచేస్తాయి. చర్మాన్ని పట్టులా ఉంచడంతో పాటు కళ్లకు ఆరోగ్యకరమైన మెరుపునిస్తాయి.
 
3. ఆకుకూరలు తినడం వల్ల చర్మం మెరవడమే కాదు వయసు కనపడదు.
 
4. విటమిన్ సి పుష్కలంగా ఉన్న బ్రొకెల్లీ తింటే చర్మం ముడతలు పడదు. వయసుతో పాటు వచ్చే చర్మం పొడారిపోయే గుణం కూడా పోతుంది.
 
5. నీరు పుష్కలంగా వుండే పుచ్చకాయలో యాంటాక్సిడెంట్లు ఎక్కువ ఉండటంతో నవయవ్వనంగా కనిపిస్తారు. 
 
6. ఆలివ్ నూనె వాడితే యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉంటారు. చర్మం శిరోజాలు మెరుస్తుంటాయి.