సాధారణంగా వయసు పెరుగుతున్న అందంగా, ఆరోగ్యంగా ఉండాలనే కొరిక అందరికి ఉంటుంది. దానికి చేయాల్సిందల్లా తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టడమే. పోషకాహారం, కంటినిండా నిద్ర, ప్రశాంతమైన మనసు... ఈ మూడూ చర్మం మెరిసిపోవడానికి ముఖ్యంగా పాటించాల్సినవి. ఇందులో ఆహారానిదే ప్రధానపాత్ర. ఓ తాజా అధ్యయనం ప్రకారం, ఆహారంలో చక్కెర ఎక్కువగా తీసుకునేవాళ్లు వారి అసలు వయసు కన్నా పెద్దవారిలా కనిపిస్తున్నట్లు తేలింది. అందుకే చక్కెర ఎక్కువగా ఉండే శీతల పానీయాలూ, క్యాండీలూ, కేకులూ, కుకీలకు దూరంగా ఉండాలి.
సహజ చక్కెరలు కలిగే ఉండే తాజా పండ్లను ఎక్కువగా తినాలి. ఉప్పు ఎక్కువగా తినడం తగ్గించాలి. ఒక రోజులో తినే ఆహార పదార్థాలన్నింటిలో ఒక టీ స్పూను కన్నా ఎక్కువ ఉప్పు వేయకుండా ఉంటే మంచిది. ఆడవారు అందంగా నాజూగ్గా వుండాలి. ఆడవాళ్లు అందంగా కనిపించాలంటే బాహ్యాలంకరణ మాత్రమే వుంటే చాలదు. స్వతస్సిద్ధంగా కూడా అందంగా వుండాలి. వయసుకు తగ్గ అందం వుండాలి. అందంగా వుండాలనుకుంటే శరీరం తప్పకుండా ఆరోగ్యవంతంగా వుండాలి.
ఆరోగ్యానికి ఆయువుపట్టు మీరు తీసుకునే ఆహారం నియమబద్దంగా వుండాలి. పౌష్టికాహారాన్ని నియమబద్ధంగా తీసుకుంటూ తగు మోతాదులో శరీర వ్యాయామం చేసుకుంటూ అందంగా, ఆరోగ్యంగా వుండాలి. ఇది ఆడవారికి అత్యంత ముఖ్యం. చేయగలిగిత ఇంటిపని చేయాలి. మన శరీరంలోని కణాలు నిర్వీర్యం కాకుండా పొషించేవి విటమిన్లు, న్యూట్రిషియన్ ఫుడ్‌ను తీసుకోవాలి. అంటే పరిపూర్ణ ఆహారం తీసుకోవాలి. పాలు, పండ్లు వంటివి బ్యాలెన్స్‌డు డైటు తీసుకోవాలి.
మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు విటమిన్లు మినరల్స్ కొవ్వు పదార్థాలు వుండాలి. మనం తీసుకునే ఆహారంలో హెచ్చుభాగం పండ్లు, కూరగాయలు వుండాలి. పంచదార కన్నా తేనెను వాడవచ్చు. అలాగే తాజా ఆకుకూరలు, టమాటోలు, దోసకాయ మొదలైనవాటిలో కాల్షియం ఎక్కువగా వుంటుంది. అంతేకాకుండా కెరోటిన్, రిబోప్లోవిన్, విటమిన్ సి, పోలిక్ ఏసిడ్ వుంటాయి. కాబట్టి ఇవే ఎక్కువగా తీసుకోవాలి. ఆరంజ్, యాపిల్, బొప్పాయి తింటే ఆరోగ్యమైన చర్మం ఏర్పడుతుంది. లెమన్ జ్యూస్ మంచిది. ఇందులో సి విటమిన్ వుండి చర్మాన్ని ఇన్‌ఫెక్షన్ నుంచి కాపాడుతుంది.
ఎక్కువగా టీ, కాఫీ త్రాగకూడదు. అతి చల్లని పానీయాలు ఆరోగ్యానికి హానికరం. నీరు పుష్కలంగా తాగడం వలన శరీరంలోని మలినాలని ప్రక్షాళన చేస్తుంది. ఇంకా మజ్జిగ, వెన్న తీసిన పాలు ఆరోగ్యానికి మంచిది. డబ్బాల్లో ప్యాక్ చేసిన పండ్లు, కూరలు వాడకూడదు. జీర్ణకోశం శుభ్రంగా వుండాలంటే పీచు ఎక్కువగా వున్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. గ్యాస్ ప్రాబ్లమ్ వుంటే నూనె వస్తువులు, శనగపిండితో చేసే వాటిని తగ్గించాలి. క్రమంతప్పకుండా వ్యాయామం, నడక శరీరాన్ని అనవసరంగా పెరగనివ్వకుండా చేస్తుంది. తిండి తినకుండా మాడితే మనుషులు బరువు తగ్గుతారనేది సరైనది కాదు. బ్యాలెన్స్‌డ్ ఫుడ్ తీసుకోవాలి. స్వీట్లు మితంగా తినాలి. ఇక తిండి తినేటప్పుడు పుస్తకాలు చదవడం, టీవి చూడటం చేయకూడదు.
మూడేళ్ల క్రితం చేసిన ఓ పరిశోధనలో పసుపు, ఆకుపచ్చ రంగులో ఉన్న కూరగాయలూ, పండ్లూ తినడం వల్ల ముఖంపై ముడతలు రావడం తగ్గుతుందని తెలిసింది. అలాగే వివిధ రంగుల్లో ఉండి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పళ్లను తింటే వయసు అయిదేళ్లు తగ్గినట్టు కనిపిస్తారు. ఇక, చర్మం తాజాగా మారిపోవాలి అనుకునేవారు చేపల్ని తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఒమెగా 3, ఫ్యాటీ ఆమ్లాలూ, ప్రొటీన్లూ ఉన్న చేపలు తింటే అందం, ఆరోగ్యం సొంతం అవుతాయి.