శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 26 ఫిబ్రవరి 2015 (18:17 IST)

ముఖానికి టమోటో జ్యూస్ అప్లై చేస్తే..?

ముఖానికి టమోటో జ్యూస్ అప్లై చేయడం వల్ల చర్మం కాంతివంతం చేస్తుంది. రాత్రి నిద్రించేందుకు ముందు టమోటోను సగానికి  కట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. తర్వాత రోజు ఉదయం చల్లటి నీటితో శుభ్రంగా కడిగి మార్పును గమనించండి. టమోటో జ్యూస్ మెటిమలను నివారించడంలో చాలా గ్రేట్‌గా సహాయపడుతుంది. 
 
దీనికి ముందు ఐస్ క్యూబ్‌తో ముఖం మీద మర్దన చేయాలి. 15నిముషాల తర్వాత టమోటో ముక్కలతో ముఖం మీద మర్దన చేయాలి. ఒక గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.  ఇలా చేస్తే మొటిమలను దూరం చేసుకోవచ్చు.
 
ఇకపోతే.. టమోటో జ్యూస్‌తో డార్క్ స్కిన్ నివారించుకోవచ్చు. ఒక బౌల్లో, టమోటో జ్యూస్‌ను తీసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం, బేకింగ్ సోడా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయాలి. 10నిముషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.