శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Modified: బుధవారం, 14 నవంబరు 2018 (17:41 IST)

జుట్టుకు రంగులేసుకునేవారు తప్పకుండా తెలుసుకోవాల్సినవి...

వెంట్రుకలకు రంగు వేసే ముందు చిన్నపాటి చిట్కాలు పాటిస్తే ఎంతో మేలు జరుగుతుంది. ముందుగా తలస్నానం చేసి జట్టును బాగా ఆరనివ్వాలి. తర్వాత పెద్ద పళ్ళున్న దువ్వెనతో చిక్కు లేకుండా దువ్వాలి. ఇప్పుడు జుట్టును నాలుగు సమ భాగాలుగా విడదీయాలి. ఒక్కొక్క భాగానికీ క్లిప్ పెట్టాలి. హెయిర్ కలర్ లేదా హెయిర్ డైను కంపెనీ సూచించిన ప్రకారం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని డై అప్లికేటర్ బాటిల్‌లో పోయాలి.
 
క్లిప్పులు పెట్టిన పాయలలో ఒక పాయకు క్లిప్ తీసివేసి, అప్లికేటర్ బాటిల్ మూత తీసి జుట్టు కుదుళ్లకు దగ్గరగా పెట్టి నొక్కాలి. సన్నపాయలు తీస్తూ కుదుళ్లకు కలర్ పట్టించాలి. అన్ని కుదుళ్లకూ రంగు పట్టేలా చేసి తిరిగి క్లిప్ పెట్టాలి. ఒక భాగం పూర్తయ్యాక మరొక భాగానికి.. ఇలా నాలుగు భాగాలకూ కలర్ పట్టించాలి.
 
అన్ని భాగాలకూ కలర్ పట్టించిన తరువాత క్లిప్పులను తీసివేసి... జుట్టుకు, కుదుళ్లకు గాలి తగలనివ్వాలి. చివరగా.. మీరు వాడిన కలర్‌ను తయారుచేసిన కంపెనీ సూచించినంతసేపు అలాగే ఉండి, ఆ తర్వాత శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా చేసినట్లయితే జుట్టంతా రంగు సమంగా అప్లై అవుతుంది, చూసేందుకు సహజసిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది.