శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 17 నవంబరు 2014 (16:35 IST)

అసలే చలికాలం : పెదాలను కాపాడుకోవడం ఎలా?

అసలే చలికాలం.. పెదాలను కాపాడుకోవడం ఎలాగో తీసుకోవాలా.. అయితే ఈ టిప్స్ పాటించండి. ఈ సీజన్‌లో పెదాలు ఎక్కువ పగిలి పోతాయి. అందుచేత రాత్రి పడుకునే ముందు పెదాలకు మీగడ లేదా వెన్న రాసుకున్న మృదువుగా తయారవుతాయి.  
 
చలికాలంలో పెదవులు పగిలిపోయినట్లు అనిపిస్తే... నాలుకతో తడి చేసుకోకూడదు. అలా చేస్తే పెదవులు ఎండిపోయి చర్మం మొద్దుబారిపోతుంది. పెదవులు పగులకుండా ఉండాలంటే.. మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు. 
 
అలాగే రాత్రిపూట గులాబీ రేకుల రసాన్ని పెదవులకు రాసుకుని పడుకున్నట్లయితే.. పెదవులు పగలకుండా ఉంటాయి. గులాబీ రేకుల రసం అందుబాటులో లేనట్లయితే కోల్డ్ క్రీమ్ కూడా వాడవచ్చు.