శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శుక్రవారం, 7 డిశెంబరు 2018 (14:21 IST)

చలికాలంలో చర్మానికి ఏం చేయాలి..

చలికాలంలో చర్మం పొడిబారకుండా వుండాలంటే.. ఇంట్లోనే కొన్ని ఫేషియల్స్ ముఖానికి వేసుకోవాలి. అవేంటంటే.. చలికాలం చర్మానికి బాదం ఫేషియల్ మెరుగైన ఫలితాలను ఇస్తుంది. బాదం పప్పులో ఓ పదింటిని నీటిలా బాగా నానబెట్టి.. పై పొట్టును తీసేసి బాగా మిక్సీలో పేస్టులా రుబ్బుకోవాలి. ఈ పేస్టుకు కాస్త శెనగపిండి, పాలు, నిమ్మరసం చేర్చి ఫేషియల్ ప్యాక్ వేసుకుంటే.. ముఖం పొడిబారకుండా వుంటుంది. 
 
శీతాకాలంలో చర్మం మెరిసిపోతుంది. పసుపు పొడి, చందనం, పాలు, బాదం ఆయిల్, నిమ్మరసం, కోడిగుడ్డు వీటిని ఓ బౌల్‌లోకి తీసుకుని పేస్టులా చేసి ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటే.. చర్మంపై వున్న మచ్చలు తొలగిపోతాయి. ఇదే తరహాలో తేనె ఒక స్పూన్, పాల పౌడర్ ఒక స్పూన్, నిమ్మరసం ఒక స్పూన్, బాదం ఆయిల్ ఒక స్పూన్ తీసుకుని బాగా పేస్టులా సిద్ధం చేసుకుని.. ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. 
 
అదేవిధంగా ఓట్స్ రెండు స్పూన్లు, పెరుగు రెండు స్పూన్లు, టమోటా జ్యూస్ రెండు స్పూన్లు చేర్చి బాగా కలిపి పేస్టులా అయ్యాక ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది. అరకప్పు బాదం ఆయిల్‌కు రెండు స్పూన్ల పంచదార చేర్చి, ఆపై ఒక స్పూన్ నిమ్మరసాన్ని చేర్చి.. ముఖాన్ని బాగా శుభ్రం చేసుకున్నాక.. ఈ ఆయిల్‌తో స్క్రబ్ చేసుకోవాలి. పది నిమిషాల పాటు బాగా స్క్రబ్ చేసి చల్లని నీటిలో ముఖాన్ని కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది.