Widgets Magazine Widgets Magazine

మనం సంపాదించే, ఖర్చుపెట్టే ప్రతి పైసాపై కేంద్రం నిఘా.. ఆధార్ లేకపోతే బ్యాంక్ ఖాతా కూడా క్లోజే.నట

హైదరాబాద్, శనివారం, 17 జూన్ 2017 (03:44 IST)

Widgets Magazine
aadhaar card

భారత్ లోని 130 కోట్ల మంది ప్రజల ఆదాయ, ఖర్చుల వివరాలు ఇకపై కేంద్రం గుప్పిట్లోకి వెళ్లనున్నాయి. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమాలో ప్రార్థన.. ప్రతి పైసా కౌంటే ఇక్కడ అని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం మనందరి జుత్తు తన చేతిలోకి చిక్కించుకునే కీలకనిర్ణయం తీసుకుంది. అదేమిటంటే ఆధార్ లేకుంటే ఇకపై బ్యాంక్ ఖాతాలు తెరవడానికి వీల్లేదు. ఆరు నెలల్లోపు బ్యాంకు ఖాతాదారులు ఆధార్‌ నంబర్‌ను బ్యాంకు శాఖకు అందజేయాలి. ఇకపై ఆయా ఖాతాల నెలవారీ, వార్షిక లావాదేవీలు, ఖాతాలోకి నగదు జమలపై బ్యాంకుల ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. 
 
బ్యాంకులో కొత్త ఖాతా తెరవాలంటే ఇకపై ఖచ్చితంగా ఆధార్‌ నంబర్‌ను తెలపాలి. అంతేకాకుండా రూ.50,000, అంతకు మించిన మొత్తాల లావాదేవీలకు సైతం ఆధార్‌ నంబర్‌ను తప్పనిసరి చేస్తూ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇప్పటికే బ్యాంకు ఖాతా ఉన్న వినియోగదారులు ఈ ఏడాది డిసెంబర్‌ 31లోగా తమ ఆధార్‌ నంబర్‌ను తెలపాల్సి ఉంటుంది. అలా నంబర్‌ ఇవ్వని పక్షంలో సంబంధిత ఖాతాల లావాదేవీలను స్తంభింపజేస్తామని నోటిఫికేషన్‌లో స్పష్టంచేశారు.కొత్త బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర రెవిన్యూ శాఖ తాజాగా నోటిఫికేషన్‌ విడుదలచేసింది. 
 
వేర్వేరు పాన్‌ నంబర్ల సాయంతో కొందరు పన్నులను ఎగవేస్తున్న నేపథ్యంలో ప్రతీ పాన్‌ నంబర్‌తోపాటు ఆధార్‌ నంబర్‌నూ జతచేయాలని గతంలోనే ప్రభుత్వం సూచించింది. వ్యక్తులు, సంస్థలు, ఉమ్మడి వ్యాపార సంస్థలు పాన్‌ లేదా ఫారమ్‌ 60తోపాటు ఆధార్‌ నంబర్‌ ఇవ్వాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. సరైన కేవైసీ పత్రాలు లేకుండా కొత్త చిన్న మొత్తాల ఖాతా తెరవాలంటే గరిష్టంగా రూ.50,000 మాత్రమే డిపాజిట్‌ చేయాలని సూచించారు. ప్రధాన బ్యాంకుల శాఖల్లోనే ఇలాంటి ఖాతాలను తెరవాలని కొత్త నిబంధన పెట్టారు. 
 
ఏడాదిలోపు ఆయా ఖాతాకు సంబంధించిన కేవైసీ పత్రాలను ఖచ్చితంగా జతపరచాల్సి ఉంటుంది. కొత్తగా ఖాతా తెరిచే వ్యక్తి ఆధార్‌ నంబర్‌ లేకపోతే, ఆధార్‌ కోసం ఎన్‌రోల్‌ చేసుకున్న నంబర్‌ను తెలపాలి. ఆరు నెలల్లోపు ఆధార్‌ నంబర్‌ను బ్యాంకు శాఖకు అందజేయాలి. ఆయా ఖాతాల నెలవారీ, వార్షిక లావాదేవీలను, ఖాతాలోకి నగదు జమాలపై బ్యాంకుల ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

మన వీధి అంగడిని, సూపర్ మార్కెట్‌ని ఇక మర్చిపోండి.. మన ఇంటికే మొబైల్ మార్కెట్

షాప్ వద్దకు పోకుండానే షాప్ లోని సరకులు నేరుగా మన ఇంటికే రప్పించుకునే ఆన్ లైన్ షాపింగే ...

news

దొంగ అని ఇద్దరు తాగుబోతులే అరిచారు.. బ్యాంకులకు ఎగనామమా? తీర్పు వరకు ఆగలేరా?: మాల్యా

బ్యాంకులకు ఎగనామం వేసి లండన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. భారత మీడియాపై ఫైర్ ...

news

అటు రుతుపవన వర్షాలు... ఇటు డిస్కౌంట్ల వర్షాలు.. రిటైలర్లకు జీఎస్టీ షాక్

ముంచుకొస్తున్న జీఎస్టీ భూతాన్ని ఎలా తట్టుకోవాలో తెలీక మల్లగుల్లాలు పడుతున్న రిటైలర్లు ...

news

జూలై 1 నుంచి జీఎస్టీ అమలు : జైట్లీ కరుణతో పన్నుశాతం తగ్గిన వస్తువులివే

వస్తు, సేవలపన్ను (జీఎస్టీ) విధానం వచ్చేనెల ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి ...