గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2023 (12:07 IST)

ఎయిరిండియా బంపర్ ఆఫర్.. రూ.1470కే ప్రయాణ టిక్కెట్

air india
ఎయిరిండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రారంభ టిక్కెట్ ధరను రూ.1470గా నిర్ణియించింది. అలాగే, బిజినెస్ క్లాస్ టిక్కెట్ ధరను కూడా రూ.10130కే కొనుగోలు చేసే వెసులుబాటును కల్పించింది. దేశీయ, ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్గాల్లో కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించింది. ఈ ఆఫర్ గురువారం నుంచి మొదలైంది. ఆదివారం అర్థరాత్రి 11.59 నిమి,ాల వరకు అందుబాటులో ఉంటుంది. 96 గంటలపాటు అమల్లో ఉండే ఈ ఆఫర్‌లో ఎలాంటి ఇతర సౌకర్య రుసుము లేకుండా ప్రారంభ టిక్కెట్ ధరను ఖరారు చేసింది. 
 
ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీలోపు ప్రయాణించాల్సి ఉంటుందని ఎయిరిండియా తెలిపింది. ఎయిర్‌ ఇండియా వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. వచ్చే పండగ సీజన్‌లో తక్కువ విమాన ప్రయాణం చేయాలనుకునేవారిని దృష్టిలో ఉంచుకుని ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిది. రిటర్న్ టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి డబుల్ లాయల్టి బోనస్ పాయింట్లను కూడా కేటాయించనుంది.