మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 7 డిశెంబరు 2021 (20:03 IST)

ఆంధ్రప్రదేశ్- తెలంగాణ స్థానిక వ్యాపారుల కోసం అమెజాన్ పే 'స్మార్ట్ స్టోర్స్'

అమెజాన్ పే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని 12 ముఖ్య నగరాల్లో ఆఫ్‌లైన్ ఎలక్ట్రానిక్ రిటైలర్‌ల భాగస్వామ్యంతో తమ “స్మార్ట్ స్టోర్స్” ప్రోగ్రామ్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు మరియు రాజమండ్రిలోని 1500+ ఎలక్ట్రానిక్స్ స్టోర్‌లకు ఈ విస్తరణ, స్మార్ట్ స్టోర్స్ అనుభవాన్ని తెస్తుంది. వినియోగదారులు అమెజాన్ యాప్‌ని ఉపయోగించి స్మార్ట్ స్టోర్ యొక్క QR కోడ్‌ని స్కాన్ చేయవచ్చు ఇంకా బజాజ్ ఎలక్ట్రానిక్స్, బిగ్ సి, హ్యాపీ మొబైల్స్, బిన్యూ, సోనోవిజన్, పై ఇంటర్నేషనల్, సెలెక్ట్ మొబైల్స్, లాట్ మొబైల్స్, టచ్ మొబైల్స్ వంటి ఆఫ్‌లైన్ ఎలక్ట్రానిక్ రిటైలర్‌లలో ఇంకా ఇతర దుకాణాలలో వేలాది ఉత్పత్తులను కనుగొనవచ్చు.

 
విస్తరణపై వ్యాఖ్యానిస్తూ, అమెజాన్ పే, సీఈఓ & వైస్ ప్రెసిడెంట్, మహేంద్ర నెరూర్కర్ మాట్లాడుతూ, “మా కస్టమర్‌లు మరియు వ్యాపారులకు విశ్వసనీయమైన, అనుకూలమైన మరియు ప్రతిఫలదాయకమైన అనుభవాన్ని అందించే మా ప్రయత్నంలో, మేము మా స్మార్ట్ స్టోర్స్ ప్రోగ్రామ్‌ను మరింత విస్తరిస్తున్నాము. దీనితో, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని మా పార్టనర్ ఎలక్ట్రానిక్ స్టోర్‌లు అధిక కనుగొన గల సామర్థ్యాన్ని మరియు వారి కస్టమర్‌లకు విస్తరించబడిన కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు, ఈఎంఐ లు, బ్యాంక్ ఆఫర్‌లు ఇంకా అమెజాన్ పే రివార్డ్‌లను ఆస్వాదిస్తాయి. కస్టమర్‌లు ఇన్-స్టోర్ షాపింగ్ అనుభవాన్ని సులభతరం చేసే డిజిటల్ బిల్లులు మరియు వాయిస్ ఆధారిత చెల్లింపులు వంటి సేవలను అందించడానికి ఇది వారిని సశక్త పరుస్తుంది.”

 
స్మార్ట్ స్టోర్స్ డిజిటల్ స్టోర్ ఫ్రంట్‌లో ఉత్పత్తులను ఎంచుకున్న తర్వాత, కస్టమర్‌లు అమెజాన్ పేని ఉపయోగించి చెక్‌అవుట్ చేయవచ్చు, ఇది యూపిఐ, నెట్ బ్యాంకింగ్, అమెజాన్ పే బ్యాలెన్స్: డబ్బు లేదా క్రెడిట్ ఇంకా డెబిట్ కార్డ్‌ల ద్వారా చెల్లించడానికి వారికి ఎంపికను అందిస్తుంది. అదనంగా, కస్టమర్‌లు తమ లావాదేవీని అక్కడికక్కడే ఈఎంఐగా మార్చుకోవడాన్ని ఎంచుకోవచ్చు ఇంకా వారి బ్యాంకులు లేదా అమెజాన్ పే నుండి అద్భుతమైన రివార్డ్‌లను పొందవచ్చు. ఇంకా, బిల్లు డిజిటల్‌గా డెలివరీ చేయబడుతుంది, మొత్తం కొనుగోలు చేసే ప్రయాణాన్ని కాంటాక్ట్‌లెస్‌గా, సౌకర్యవంతంగా మరియు ప్రతిఫలదాయంకంగా చేస్తుంది.

 
“అమెజాన్ పే స్మార్ట్ స్టోర్‌ల ప్రారంభంతో, కస్టమర్ వాక్-ఇన్‌లలో మేము మంచి మెరుగుదలని చూశాము, ఇది మా స్టోర్‌లలో మొత్తం అమ్మకాలను పెంచడానికి దారితీసింది. మొత్తం అనుభవం సుగమంగా ఇంకా ప్రతిఫలదాయంకంగా ఉన్నందున వినియోగదారులు అమెజాన్ పే ని ఉపయోగించి చెల్లించడాన్ని ఇష్టపడతారు.”- సాయి నిఖిలేష్, సీఈఓ, బీన్యూ మొబైల్స్.

 
“ఏ.పి. ఇంకా తెలంగాణకు చెందిన ప్రముఖ మొబైల్ రిటైల్ అవుట్‌లెట్ చైన్‌గా, మా అమ్మకాలను మెరుగుపరచడానికి ఇంకా మా లక్ష్యమైన ప్రేక్షకుల మధ్య బ్రాండ్ విశ్వసనీయతను ఏకకాలంలో పెంచడానికి మేము ఎల్లప్పుడూ వినూత్న మార్గాల కోసం వెతుకుతూ ఉంటాము. ఈ డొమైన్‌లో తీవ్రమైన పోటీ ఉన్నందున, మా కొనుగోలుదారు సేకరణ వ్యూహాలు పోటీగా ఉంటే తప్ప మా టాప్‌లైన్ ఆదాయాలు పెరగవు. ఈ సందర్భంలో, అమెజాన్ పే వారి అద్భుతమైన ఆఫర్‌ల జాబితా ద్వారా మా అమ్మకాలను పెంచడంలో కీలక పాత్ర పోషించింది. ఈ భాగస్వామ్యంతో మేము సంతోషిస్తున్నాము మరియు రాబోయే మరింత ఉత్తేజకరమైన సంవత్సరాల కోసం ఎదురు చూస్తున్నాము" అన్నారు శరణ్ శ్రీ హర్ష, వీపి- ఆపరేషన్స్, హ్యాపీ మొబైల్స్.