శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2015 (19:06 IST)

పర్యాటకప్రదేశ్‌ : ఏపీలో 8 ప్రాజెక్టుల ఒప్పందాల ఖరారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక ప్రదేశ్‌గా మార్చుతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీన్ని నిజం చేసేలా శనివారం ఒక్కరోజే ఏడు పర్యాటక ప్రాజెక్టుల ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి మరో ముందడుగు వంటివి. 
 
విజయవాడలో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సమక్షంలో రూ.1240 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టులపై ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా విజయవాడ, తిరుపతి, విశాఖల్లో ఎమ్యూజెమెంట్‌, వాటర్‌ వరల్డ్‌ పార్కులు నిర్మించనున్నారు. 
 
డెస్టినేషన్‌ అండ్‌ ప్యాకేజ్‌ టూర్లు, హోటల్స్‌, రిసార్టులు, బీచ్‌ రిసార్టులు , ఫైవ్‌స్టార్‌, తీస్టార్‌ హోటళ్లు, కడపలో వే సైడ్‌ అమెనిటీస్‌ ఏర్పాటు తదితర ఒప్పందాలు ఖరారయ్యాయి. తిరుచానూరులో గేట్‌వే హోటల్‌ నిర్మాణానికి ఒప్పందం జరిగింది. రెండకెరాల విస్తీర్ణంతో రూ.85 కోట్ల పెట్టుబడితో గేట్‌వే హోటల్‌ను నిర్మించనున్నారు.