శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 15 డిశెంబరు 2018 (16:38 IST)

రూ.100 కోట్ల ఖర్చుతో అమెరికాలో ఆపిల్ భవనం..

ప్రముఖ ఐటీ సంస్థ యాపిల్ అమెరికాపై కన్నేసింది. ఇటీవల లక్ష కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిన అగ్ర సంస్థగా నిలిచిన ఆపిల్.. అమెరికా మార్కెట్‌ను పెంచేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో వంద కోట్ల ఖర్చుతో కొత్త భవనాన్ని ఏర్పాటు చేయనుంది.


ఈ భవనం అమెరికాలోని టెక్సాస్ నగరంలో ఆపిల్ సంస్థ ఈ భవనాన్ని నిర్మించనుంది. ఇది కాకుండా కపర్టినో, కాలిఫోర్నియా, అస్టిన్ వంటి నగరాల్లోనూ కొత్త భవనాలను నిర్మించనున్నట్లు ఆపిల్ సంస్థ వెల్లడించింది. 
 
ఆపిల్ సంస్థ కొత్త భవనాలను ఏర్పాటు చేయడం ద్వారా యువతకు భారీగా ఉద్యోగవకాశాలు ఇవ్వనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఏడాది మాత్రం ఆపిల్ 6వేల ఉద్యోగాలను కల్పించినట్లు ఆపిల్ తెలిపింది.

కానీ 90వేల మంది ఉద్యోగులను సంస్థ బదిలీ చేసింది. ఇందుకు ఇటీవల చైనాలో ఆపిల్, ఐఫోన్‌లపై నిషేధం విధించడమే కారణమని ఆపిల్ ఓ ప్రకటనలో సంస్థ వెల్లడించింది.