శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2016 (17:14 IST)

రాజ్‌నాథ్‌కు ఎదురైన అనుభవం చాలదా.. పాక్ టూర్ పట్ల జైట్లీ వ్యాఖ్యలు

పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న సార్క్ దేశాల ఆర్థిక మంత్రుల సదస్సుకు భారత ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గైర్హాజరు కానున్నారు. దీని వెనుక బలమైన కారణం లేకపోలేదు.

పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న సార్క్ దేశాల ఆర్థిక మంత్రుల సదస్సుకు భారత ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గైర్హాజరు కానున్నారు. దీని వెనుక బలమైన కారణం లేకపోలేదు. ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన సార్క్ హోం మంత్రుల సదస్సుకు భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. ఆ సమయంలో ఆయనకు ఎదురైన చేదు అనుభవం నుంచి అందరికీ తెల్సిందే.
 
ఈ అనుభవంతో పాఠాలు నేర్చుకున్న జైట్లీ... ఇస్లామాబాద్‌లో జరుగనున్న సార్క్ ఆర్థిక మంత్రుల సదస్సు‌కు వెళ్లరాదని తాజాగా నిర్ణయించారు. ఈనెల 25, 26 తేదీల్లో ఇస్లామాబాద్‌లో ఈ సమావేశం జరుగనున్నది. దీనికి భారత్ తరపున జైట్లీకి బదులుగా ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ హాజరుకానున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 
 
కాశ్మీర్‌లో బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ అనంతరం ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన సార్క్ హోం మంత్రుల సదస్సుకు రాజ్‌నాథ్ హాజరుకాగా, ఆయన రాకను అడ్డుకుంటామంటూ కొందరు ఉగ్రవాద సంస్థల నేతలు సహా ఆందోళనకారులు నిరనస ప్రదర్శనలు చేపట్టారు. దీంతో పాక్ వైఖరిని సార్క్ వేదికపై రాజ్‌నాథ్ ఎండగట్టారు. సార్క్ దేశం ఉగ్రవాదిగా ప్రకటించిన వ్యక్తిని మరో సభ్య దేశం ఎలా అమరవీరుడిగా శ్లాఘిస్తుందంటూ పరోక్షంగా పాక్‌పై నిప్పులుచెరిగారు.