ఆధార్ అవసరం లేదట... ఇంకేం... హ్యాపీ...

aadhar card
Last Modified మంగళవారం, 18 డిశెంబరు 2018 (13:32 IST)
ఆధార్... ఈ పేరు చెప్పగానే కనీసం ఫోన్ సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా ఆధార్ కార్డు లేనిదే పనికాదు. బ్యాంకుకు వెళితే ఆధార్ కార్డ్ కంపల్సరీ. ఇక గ్యాస్ కనెక్షన్.. వగైరా వగైరా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వున్నాయి. ఆధార్ లేనిదే ఏ పనీ కాదు. దానితో ప్రజలు ఈ ఆధార్ కార్డు వ్యవహారంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై గుర్రో ఏమోగానీ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో భాజపా ఘోరంగా పరాజయం పాలైంది. దీనితో కళ్లు తెరిచిన కేంద్రం దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది.

ఈ ఆధార్ చట్టంలో కొన్ని మార్పులు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఆధార్ వివరాలను ఇవ్వాలా వద్దా అనేది వినియోగదారుడి విచక్షణకే వదిలేస్తారు. దీనితో అతడికి సంబంధించిన వివరాలు లీక్ అయ్యే అవకాశం లేదు. కాగా డేటా చోరీలకు పాల్పడుతున్నవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది.దీనిపై మరింత చదవండి :