పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు... ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభంకానున్నారు. ఈ సమావేశాలు ఏప్రిల్ మూడో తేదీవరకు రెండు దఫాలుగా జరుగనున్నాయి. తొలి దఫా సమావేశాలు జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు, రెండో దఫా సమావేశాలు మార్చి రెండో తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు నిర్వహించారు.
అదేసమయంలో ఫిబ్రవరి ఒకటో తేదీన 2020-21 సంవత్సర వార్షిక బడ్జెట్‌ను కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఈ బడ్జెట్ సమావేశాలను రెండు దశల్లో నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ (సీసీపీఏ) సిఫార్సు చేసింది.
మరోవైపు, భారత్ వృద్ధిరేటు గణనీయంగా తగ్గనుంది ప్రపంచ బ్యాంకు ఇటీవల వెల్లడించింది. ఈ సారి వృద్ధిరేటు 4 నుంచి 5 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. దీనికి కారణం ప్రాంతీయ అసమానతలని వ్యాఖ్యానించింది. అలాగే, పాకిస్థాన్ వృద్ధిరేటు కూడా మూడు శాతానికే పరిమితమవుతుందని తెలిపింది. వృద్ధిరేటు పడిపోవడానికి అనేక కారణాలను ప్రపంచ బ్యాంకు తన నివేదికలో తెలిపింది.