శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 4 మార్చి 2017 (19:40 IST)

కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ మూసివేతకు ఆ ఇంజన్లే కారణం.. మాల్యా ట్వీట్

దేశంలో కారుచౌక విమాన ప్రయాణాన్ని పరిచయం చేసిన సంస్థ కింగ్‌ఫిషర్. ఒకపుడు దేశీయ విమాన రంగంలోనే కాకుండా, అంతర్జాతీయంగా కూడా గట్టి పోటీ ఇచ్చిన సంస్థ. ఈ సంస్థ అధిపతి లిక్కర్ డాన్ విజయ్ మాల్యా. నష్టాల ఊబిలో

దేశంలో కారుచౌక విమాన ప్రయాణాన్ని పరిచయం చేసిన సంస్థ కింగ్‌ఫిషర్. ఒకపుడు దేశీయ విమాన రంగంలోనే కాకుండా, అంతర్జాతీయంగా కూడా గట్టి పోటీ ఇచ్చిన సంస్థ. ఈ సంస్థ అధిపతి లిక్కర్ డాన్ విజయ్ మాల్యా. నష్టాల ఊబిలో కూరుకున్న కింగ్‌ఫిషర్‌ను మూసివేశారు. అయితే, ఈ నష్టాలకు ఓ కారణం ఉందంటూ విజయ్ మాల్యా తాజాగా ట్వీట్ చేశారు. 
 
కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కుప్పకూలిపోవడానికి లోపాలున్న విమాన ఇంజన్లు ఒక కారణమని ఆయన పేర్కొన్నారు. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు లోపాలున్న ఇంజన్లను సరఫరా చేసినందుకు పరిహారం చెల్లించాలని ప్రాట్‌ అండ్‌ విట్నీకి చెందిన ఐఈపై దావా వేసినట్టు ఆయన గుర్తుచేశారు. 
 
ప్రాట్‌ అండ్‌ విట్నీ విమాన ఇంజన్లపై డీజీసీఏ దర్యాప్తు చేపట్టడం తనకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదని విజయ్‌ మాల్యా ట్వీట్‌ చేశారు. లోపాలున్న ఇంజన్ల వల్ల దురదృష్టవశాత్తు కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కుప్పకూలిపోయిందని ఆయన పేర్కొన్నారు. 
 
ఎయిర్‌బస్‌ 320 నియో విమానాల్లో ఉపయోగిస్తున్న ప్రాట్‌ అండ్‌ విట్నీ ఇంజన్లపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో మాల్యా ట్వీట్‌ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.