శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (16:01 IST)

నవంబర్‌ నుంచి ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌లో కొత్త నిబంధనలు!

నవంబర్ ఒకటో తేదీ నుంచి ఎటీఎం (ఎనీ టైమ్ మనీ) టాన్సాక్షన్స్‌లో కొత్త నిబంధనలు అమలుకు రానున్నాయి. భారత రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన కొత్త నియమావళి మేరకు మేరకు ఆయా బ్యాంకులు ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తున్నాయి. 
 
ఈ నిబంధనల ప్రకారం. ఒక వ్యక్తి తను బ్యాంకు ఖాతా కలిగిన ఏటీఎం కేంద్రంలో నెలకు ఐదు సార్లు మాత్రమే ఉచితంగా నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతకుమించితే ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ.20 చొప్పున ఖాతాదారుని అకౌంట్ నుంచి ఏటీఎం రుసుం కింద వసూలు చేస్తారు. 
 
అలాగే, ఇతర బ్యాంకు ఏటీఎంలలో అయితే నెలకు మూడుసార్లు మాత్రమే ఎలాంటి ఛార్జీలు లేని లావాదేవీలు జరపవచ్చు. హైదరాబాద్ సహా ఆరు మెట్రోపాలిటన్ సిటీల్లో నూతన నిబంధనలు అమల్లోకి వస్తాయి.