మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 మే 2022 (08:57 IST)

అక్షయ తృతీయ రోజున పడిపోయిన పసిడి ధరలు

gold
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. పసిడి ధరలు అక్షయ తృతీయ రోజున పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర మంగళవారం భారీగా తగ్గింది. 
 
ఏకంగా 10 గ్రాములకు రూ.1,190 పతనం అయ్యింది. ఇక వెండి ధర కూడా అదే స్థాయిలో కిలోకు రూ.1,900 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.47,200 గా ఉంది.
 
24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,510 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.67,600 కు తగ్గింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
 
ఏపీలో విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,510గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.67,600 గా ఉంది.