శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 23 డిశెంబరు 2016 (15:29 IST)

గూగుల్ సీఈఒ సుందర్ పిచాయ్ కల సాకారం... 100 ఇండియన్ రైల్వే స్టేషన్లలో గూగుల్ ఫ్రీ వైఫై

ప్రపంచాన్ని డిజిటల్ మయం చేయడం అనేదే తన కల అని గూగుల్ సీఈఒ సుందర్ పిచాయ్ చెపుతుంటారు. అలాగని చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నారు కూడా. భారతదేశంలోని 100 ప్రధాన రైల్వే స్టేషన్లలో గూగుల్ హై స్పీడ్ వైఫై సౌకర్యాన్ని ఉచితంగా కల్పిస్తున్నారు. గూగుల్ మరియు రెయి

ప్రపంచాన్ని డిజిటల్ మయం చేయడం అనేదే తన కల అని గూగుల్ సీఈఒ సుందర్ పిచాయ్ చెపుతుంటారు. అలాగని చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నారు కూడా. భారతదేశంలోని 100 ప్రధాన రైల్వే స్టేషన్లలో గూగుల్ హై స్పీడ్ వైఫై సౌకర్యాన్ని ఉచితంగా కల్పిస్తున్నారు. గూగుల్ మరియు రెయిల్ టెల్ మధ్య ఒప్పందం మేరకు సుందర్ పిచాయ్ ఈ సౌకర్యాన్ని రైల్వే స్టేషన్లలో అందిస్తున్నారు. 
 
సుమారు కోటి మంది ఈ వైఫై సేవలను ఉపయోగించుకుంటారని అంచనా. కాగా గూగుల్ రైల్‌వైర్ వైఫై ద్వారా హెచ్.డి వీడియోలను చూడవచ్చు. ఇ-బుక్, గేమ్స్ వంటివి ప్రయాణం చేస్తున్న సమయంలో ప్లే చేసుకునేందుకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైల్ వైర్ ఫ్రీ వైఫై ద్వారా తొలిసారిగా 15 వేల మంది ఇంటర్నెట్టును యాక్సెస్ చేసినట్లు గూగుల్ తెలిపింది. ఇంకా మరో 400 రైల్వే స్టేషన్లకు ఈ సౌకర్యాన్ని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గూగుల్ తెలిపింది.