శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (17:41 IST)

రూ.25వేల జీతం ఉన్న ఉద్యోగులకే పీఎఫ్... ఈపీఎఫ్ఓ కొత్త ప్రతిపాదన..

ప్రావిడెంట్ ఫండ్‌లోనూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే ప్రావిడెంట్ ఫంఢ్‌లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టే దిశగా కేంద్రం యోచిస్తోంది. గతంలో సెప్టెంబ

ప్రావిడెంట్ ఫండ్‌లోనూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే ప్రావిడెంట్ ఫంఢ్‌లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టే దిశగా కేంద్రం యోచిస్తోంది. గతంలో సెప్టెంబర్ 1, 2014 వరకు పీఎఫ్ వేతన పరిమితి  రూ.6,500గా ఉన్నది. ఆ నిబంధనలను సవరించి దాన్ని రూ.15వేలకు పొడిగించారు.
 
కానీ కొత్త నిబంధనల మేరకు కనీసం రూ.25వేల జీతం ఉన్న ఉద్యోగులకే పీఎఫ్ వర్తింపజేయాలని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) యోచిస్తోంది. దీనిపై వచ్చేనెల జరిగే సమావేశంలో సరైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

ధరల పెరుగుదలతో పాటు వేతన సమీక్షలో భాగంగా ఈపీఎఫ్ఓ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. తద్వారా పీఎఫ్ వర్తించాలంటే.. ఇప్పటివరకు రూ.15వేలుగా ఉన్న కనీస వేతన పరిమితి ఇకపై రూ.25వేలకు పెరుగుతుంది.