శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (20:16 IST)

సరికొత్త 4 స్ట్రోక్‌ బ్యాక్‌ప్యాక్‌ బ్రష్‌ కటర్‌ను ఆవిష్కరించిన హోండా ఇండియా పవర్‌ ప్రొడక్ట్స్‌

భారతదేశంలో పవర్‌ ప్రొడక్ట్స్‌ తయారీలో అగ్రగామి సంస్థ హోండా ఇండియా పవర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (హిప్‌) నేడు తమ సరికొత్త 1.3 హెచ్‌పీ 4 స్ట్రోక్‌ బ్యాక్‌ప్యాక్‌ బ్రష్‌ కట్టర్‌, మోడల్‌ యుఎంఆర్‌ 435టీను భారతదేశ వ్యాప్తంగా విడుదల చేసింది. బ్రష్‌ విభాగంలో మార్కెట్‌ లీడర్‌గా కొనసాగుతున్న హిప్‌, విస్తృత శ్రేణి మోడల్స్‌ను 1 హెచ్‌పీని తేలిక పాటి వినియోగం కోసం మరియు 2 హెచ్‌పీని హెవీ డ్యూటీ వినియోగం కోసం ఆవిష్కరించింది.
 
ఈ ఆవిష్కరణ గురించి విజయ్‌ ఉప్రేటీ, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, హోండా ఇండియా పవర్‌ ప్రొడక్ట్స్‌ మాట్లాడుతూ, ‘‘వ్యవసాయ కూలీల కొరత మరియు వ్యవసాయ భూములు తరిగిపోతుండటం చేత వినియోగదారులు మరింత సౌకర్యవంతమైన పరిష్కారాలను కలుపు తీత మరియు కోత అవసరాల కోసం చూస్తున్నారు. తమ రోజువారీ కలుపుతీత కోసం ఇప్పుడు ఎక్కువ మంది బ్రష్‌ కట్టర్లను వినియోగిస్తున్నారు’’ అని అన్నారు
 
నేడు హోండా బ్రాండ్‌ బ్రష్‌ కట్టర్లను అధిక శాతం మంది వినియోగదారులు అత్యాధునిక 4 స్ట్రోక్‌ ఇంజిన్‌ సాంకేతికత, అత్యున్నత ఉత్పత్తి నాణ్యత కారణంగా వినియోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంస్థకు 600కు పైగా సేల్స్‌ అండ్‌ సర్వీస్‌ డీలర్‌షిప్‌లు ఉన్నాయి
 
ఈ నూతన ఉత్పత్తిని పండ్ల తోటలు మరియు ఏటవాలు ప్రాంతాలలో సమర్థవంతంగా కలుపు తీసేందుకు వినియోగిస్తున్నారు. యుఎంఆర్‌ 435టీ బ్యాక్‌ప్యాక్‌ బ్రష్‌కట్టర్‌ రెండు రకాలు... రెండు దంతాల బార్‌ బ్లేడ్‌తో ఎల్‌2 ఎస్‌టీ మరియు మూడు దంతాల బ్లేడ్‌తో ఎల్‌ఈడీటీ మరియు నైలాన్‌ లైన్‌ కట్టర్‌ ఉన్నాయి. ఎక్కువ సమయం ఎలాంటి అలసట లేకుండా పనిచేసే రీతిలో అత్యంత ఆకర్షణీయంగా ఈ మెషీన్లను రూపొందించారు.