శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 14 నవంబరు 2014 (14:09 IST)

ద్రవ్యోల్బణం డౌన్.. తగ్గిన నిత్యావసర ధరలు!

ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో నిత్యావసర ధరలు తగ్గాయి. టోకు ధరల సూచిక ఆధారిత ద్రవ్యోల్బణం గడచిన అక్టోబర్ నెలలో 1.77 శాతంగా నమోదైంది. 2009 తరువాత ద్రవ్యోల్బణం ఇంత తక్కువ స్థాయికి చేరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
 
దేశంలో కూరగాయలు సహా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. గత మే నెల నుంచి ఆహార ద్రవ్యోల్బణం సైతం తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే.