శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 8 జనవరి 2017 (16:38 IST)

'ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్' సరికొత్త యాప్ : ఇకపై రైల్వే టికెట్లు బుకింగ్ సులభతరం!

కొత్త సంవత్సరంలో రైలు ప్రయాణికులు రైల్వే శాఖ ఓ శుభవార్త చెప్పనుంది. రైల్వే టికెట్ బుక్ చేసుకోడానికి సులువైన యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించిన వివరాలను రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్

కొత్త సంవత్సరంలో రైలు ప్రయాణికులు రైల్వే శాఖ ఓ శుభవార్త చెప్పనుంది. రైల్వే టికెట్ బుక్ చేసుకోడానికి సులువైన యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించిన వివరాలను రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లు బుక్ చేసుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం, స్మార్ట్‌ఫోన్ వినియోగం కూడా బాగా పెరగడంతో ఈ కొత్త యాప్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఆయన వివరించారు. 
 
ఈ యాప్ వచ్చే వారంలో విడుదల అవుతుందని చెప్పారు. రైల్వే టికెట్ బుక్ చేసుకోడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న 'ఐఆర్‌సీటీసీ కనెక్ట్' యాప్‌కి బదులు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(IRCTC) లిమిటెడ్ త్వరలో సరికొత్త ఈటికెటింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
 
'ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్' పేరుతో వస్తున్న ఈ యాప్ ద్వారా రైల్వే టికెట్‌ను వేగంగా బుక్ చేసుకోవచ్చట. అయితే ఇంతకు ముందున్న 'ఐఆర్‌సీటీసీ కనెక్ట్' యాప్‌కు మరి కొన్ని కొత్త ఫీచర్లు జత చేసి 'ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్' యాప్‌ను రూపొందించారు.