గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Modified: బుధవారం, 24 అక్టోబరు 2018 (17:11 IST)

రిలయన్స్ జియో దీపావళి ధమాకా... 365 రోజులకి రూ.1699

రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా తన కస్టమర్లకు వచ్చే దీపావళి పండుగ వరకూ రూ. 1699 రీచార్జితో భారీ ఆఫర్ ప్రకటించింది. తాజాగా జియో ప్రకటించిన ఆఫర్ ఇతర టెలికాం నెట్వర్క్‌లకు సవాల్‌గా మారింది. వివరాలను పరిశీలిస్తే... ఈ దీవాళికి రూ.1699తో రీఛార్జ్‌ చేసుకుంటే వచ్చే ఏడాది దివాళి వరకు కస్టమర్లు అన్ని రకాల ప్రయోజనాలు పొందవచ్చు.
 
రీచార్జ్ చేసుకున్నవారికి ఉచితంగా లోకల్‌, ఎస్టీడీ కాల్స్, రోమింగ్ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, రోజుకు 1.5జీబీ డేటా పొందే అవకాశం వుంటుంది. మరో విశేషమేమిటంటే... 1699 రూపాయల ప్లాన్‌ పైన 100 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందే అవకాశం. 
 
కాగా ఈ ఆఫర్ పొందాలంటే కస్టమర్లు 2018 నవంబర్‌ 30 లోపు ఈ స్కీమ్‌లో చేరాలి. ఈ 100 శాతం క్యాష్ బ్యాక్‌ను కూపన్ల రూపంలో అందిస్తుంది. వీటిని రిలయన్స్‌ డిజిటల్‌ లేదా రిలయన్స్‌ డిజిటల్‌ ఎక్స్‌ప్రెస్‌ మిని స్టోర్లలో కనీసం రూ.5000 పైన కొనుగోలు చేసి వాడుకోవచ్చు.