Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హమ్మయ్య.. పాలు, ఆహారధాన్యాలను వదిలేశారు.. వీటికి జీఎస్టీ పన్ను విధించరట

హైదరాాబాద్, శుక్రవారం, 19 మే 2017 (02:18 IST)

Widgets Magazine
GSTBill

వ్యాపారులను వణికిస్తున్న జీఎస్టీ వల్ల ప్రజలకు కొన్ని అంశాల్లో బాగానే ప్రయోజనం కలిగించనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. జీఎస్టీ పుణ్యమాని ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు చాలావరకు తగ్గే అవకాశం కనిపిస్తోంది. పాలను జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయించారు. అంటే, పాల అమ్మకాల మీద ఇకమీదట ఎలాంటి పన్ను ఉండబోదు. అలాగే ఆహార ధాన్యాలు కూడా ధరలు తగ్గుతాయి. వాటిమీద ప్రస్తుతం 5 శాతం పన్ను ఉండగా, జీఎస్టీని వాటికి కూడా పూర్తిగా మినహాయించారు.
 
జీఎస్టీ రేట్లు దాదాపుగా ఖరారయ్యాయి. ఇవి సామాన్యుడికి ఉపయోగపడే రీతిలోనే కనిపిస్తున్నాయి.  బొగ్గు మీద ప్రస్తుతం 11.69% పన్ను ఉండగా, జీఎస్టీని 5%కు పరిమితం చేశారు. అలాగే పంచదార, టీ, కాఫీ, వంటనూనెల మీద కేవలం 5% పన్ను మాత్రమే పడుతుంది. దాదాపు 60 శాతం వరకు వస్తువులు 12-18% శ్లాబు పరిధిలోకే వస్తున్నాయి. తలనూనెలు, సబ్బులు, టూత్‌పేస్టుల మీద ప్రస్తుతం 28% ఉన్న పన్ను జీఎస్టీతో 18%కు తగ్గుతుంది. 
 
మొత్తం 1,211 రకాల వస్తువుల మీద ఎంతెంత పన్ను విధించాలన్న విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఒక కీలక సమావేశంలో నిర్ణయించింది. 81% వస్తువులు 18% కంటే తక్కువ పన్ను పరిధిలోకే వస్తాయని రెవెన్యూ కార్యదర్శి హస్‌ముఖ్ ఆది చెప్పారు. జీఎస్టీలోని ఏడు నిబంధనలను కౌన్సిల్ ఆమోదించిందిని, మిగిలిన రెండింటిటిని మాత్రం ఒక లీగల్ కమిటీకి నివేదించామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. శుక్రవారం జీఎస్టీ కౌన్సిల్ మరోసారి సమావేశమై సేవల మీద రేట్ల గురించి చర్చిస్తుంది. 
 
పన్ను నుంచి పూర్తిగా మినహాయించే వస్తువులు ఏవేంటన్న విషయాన్ని శుక్రవారం నాడు ఖరారుచేస్తామని, అలాగే బంగారం, బీడీల మీద పన్ను గురించి కూడా చర్చిస్తామని జైట్లీ అన్నారు. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

భారతీయ ఉత్పత్తులకు ప్రపంచ డిమాండ్‌.. ఏపీ-తెలంగాణ నుంచే అందుబాటులో 13 లక్షల వస్తూత్పత్తులు

భారతీయ వస్తువులకు కనీ వినీ ఎరుగని, ఊహించని మార్కెట్ ఆమెరికాలో ఏర్పడింది. వైవిధ్యపూరితమైన ...

news

ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో ముకేష్ అంబానీ.. ఇంటర్నెట్ అందించడంలో?

ఫోర్బ్స్ రూపొందించిన గ్లోబల్ గేమ్ ఛేంజర్స్ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ ...

news

దేశవ్యాప్తంగా ఏటీఎంలను మూసివేయండి : ఆర్బీఐ

భారత రిజర్వు బ్యాంకు కీలక ఆదేశాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలను తక్షణం ...

news

చిన్నగదిలోంచి వందల కోట్ల లావాదేవీలు.. కనిపెట్టలేని బ్యాంకులు.. ఇదే హవాలాకు లైసెన్స్

మన జాతీయ బ్యాంకులకు అంతర్గత తనిఖీ వ్యవస్థ అంటూ ఒకటి ఏడ్చిందా అంటే సందేహం కలుగుతోంది. ఒక ...

Widgets Magazine