శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 7 మార్చి 2017 (13:09 IST)

‘బేసిక్ సేవింగ్ బ్యాంకు’ ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్ అక్కర్లేదు : అరుంధతి

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్.బి.ఐ) తమ ఖాతాదారులకు కనీస బ్యాలెన్స్ నిబంధనను అమల్లోకి తీసుకునిరానుంది. అంటే బ్యాంకు ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ రూ.5 వేల మి

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్.బి.ఐ) తమ ఖాతాదారులకు కనీస బ్యాలెన్స్ నిబంధనను అమల్లోకి తీసుకునిరానుంది. అంటే బ్యాంకు ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ రూ.5 వేల మినిమమ్ బ్యాలెన్స్‌ను ఉంచాలన్నది ఆ నిబంధన సారాంశం. దీనిపై దేశవ్యాప్తంగా అలజడి చెలరేగింది. ఎస్.బి.ఐ తీసుకునే నిర్ణయం వల్ల సుమారు 31 కోట్ల మంది బ్యాంకు ఖాతాదారులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో అనేక మంది తమ ఖ్యాతాలను మూసివేయనున్నారనే ప్రచారం సాగుతోంది. 
 
దీంతో ఆ బ్యాంకు ఛైర్మన్ అరుంధతీ భట్టాచార్య స్పందించారు. ‘బేసిక్ సేవింగ్ బ్యాంకు’ ఖాతాలు లేదా ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాలకు ఈ నిబంధనలు వర్తించబోవని స్పష్టంచేశారు. ‘‘ప్రాథమిక అవసరాల కోసం వినియోగించే ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలు వర్తించవు. మిగతా బ్యాంకుల్లో చాలావరకు ఈ చార్జీలను అమలు చేస్తున్నారు’’ అని భట్టాచార్య గుర్తు చేశారు. నూతన నిబంధనలు సరిగ్గా చదవని వారే అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
వినియోగదారుల సంఖ్యను పెంచుకునేందుకు భారతీయ స్టేట్ బ్యాంకు 2012లో అప్పటివరకు అమల్లో ఉన్న మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేసింది. తిరిగి తాజాగా ఏప్రిల్ 1 నుంచి మళ్లీ అమల్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. అయితే బ్యాంకులు ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్న నిబంధనలపై వెనక్కి తగ్గేలా కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.