శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (17:50 IST)

12 నెలలు... 17.5 కోట్ల బ్యాంకు ఖాతాలు.. రూ.22 వేల కోట్లు డిపాజిట్... ఎక్కడ?

దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలోని ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా విధిగా ఉండాలన్న బలమైన ఆకాంక్షతో ప్రధానంమత్రి జన్‌ ధన్ యోజనా పథకాన్ని (పీఎంజేడీవై) ప్రవేశపెట్టారు. ఈ పథకాన్ని 2014 ఆగస్టు 28వ తేదీన ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి ఓ ఖాతా చొప్పున ప్రారంభించాలని ఆర్థిక శాఖ లక్ష్యంగా పెట్టుకోగా, ఈ లక్ష్యాన్ని 2015 జనవరి 26వ తేదీకే చేరుకున్నారు.
 
 
ఈ నేపథ్యంలో ఈ పథకం ఒక యేడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఒక యేడాది కాలంలో పీఎంజేడీవై స్కీమ్ కింద 17.5 కోట్ల ఖాతాలను ప్రారంభించగా, 22 వేల కోట్ల రూపాయల మేరకు డిపాజిట్ చేసినట్టు తెలిపింది. జమ్మూకాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు.. వామపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకం అమలులో పెద్దగా ప్రాధాన్యత కల్పించక పోవడం గమనార్హం.